విద్యార్థి నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు
వైవీయూ : వైఎస్‌ఆర్ జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయంలో చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన రాజకీయ ప్రసంగాన్ని విద్యార్థులు పట్టించుకోలేదు. పొంతనలేని మాటలతో ప్రారంభించిన ఆయన ఉపన్యాసంలో ఎప్పటిలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేసేందుకు యత్నించగా.. అదే సమయంలో వెనుకవైపు ఉన్న యువత జైజగన్.. అంటూ ఆయనకు తిరుగు సమాధానం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైవీయూకు రూ. 100కోట్లకు పైగా నిధులు కేటాయించగా..
పస్తుతం ప్రభుత్వం రూ. 40 కోట్లను ఇచ్చారని.. ఇది వైఎస్ హయాం కంటే ఎక్కువ ఎక్కువ నిధులు ఇచ్చారని పేర్కొనడం గమనార్హం. చివరగా ప్రతి ఒక్కరూ 10 మొక్కలు కాదు 100 మొక్కలు నాటాలని.. అదే స్ఫూర్తితో మా ప్రభుత్వానికి రాజకీయాల్లో అండగా నిలవాలని కోరారు. అండగా నిలుస్తామనేవారు చేతులెత్తి మద్ధతు ప్రకటించాలని కోరారు. ఈయన పిలుపుకు విద్యార్థులెవరూ చేతులెత్తకపోవడంతో మరోసారి చేతులెత్తాలని కోరినా విద్యార్థులెవరూ పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఉపన్యాసం ముగించారు.
సభలో సీఎం డౌన్‌డౌన్ నినాదాలు..
ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో తమ గొం తును వినిపించేందుకు వచ్చిన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో తామేమైనా అసాంఘిక శక్తులమా అంటూ వారితో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని హరించేలా ఏపీఆర్‌సెట్, స్క్రీనింగ్‌టెస్ట్‌లు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని దీని గురించి మాట్లాడే అవకాశం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. దీనికి ససేమిరా పోలీసులు ససేమిరా అనడంతో విద్యార్థి సంఘాల నాయకులు సీఎం గోబ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి నాయకుల నోరు మూసి, మెడలు విరుస్తూ ఈడ్చుకెళ్లారు. ఈ సందర్భంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, జనసేన విద్యార్థి విభాగం నాయకులు సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
సీఎం ప్రసంగించే సమయంలోతిరుగుముఖం పట్టిన విద్యార్థులు..
ఉదయం 7 గంటల నుంచి ముఖ్యమంత్రి కోసం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వేచి ఉన్నారు. దాదాపు 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కావడంతో అప్పటికే విసిగిపోయిన విద్యార్థులు తిరుగుముఖం పట్టారు. వీరిని ఆపేందుకు పోలీసులు కూర్చోవాలని కోరినా పట్టించుకోకుండా వెనుతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment