కూడేరు: సకాలంలో మరిన్ని ఆర్డినరీ బస్సులను నడపాలని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు అనంతపురం జిల్లా కూడేరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతపురం, ఉరవకొండల మధ్య మరిన్ని ఆర్డినరీ బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. సకాలంలో బస్సులు రాక, మోతాదుకు మించి బస్సులలో ప్రయాణం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారు. ఆలస్యంగా కాలేజీలకు వెళ్లడం వల్ల క్లాసులు నష్టపోతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ ధర్నాలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.