కోవెలకుంట్ల, న్యూస్‌లైన్ : నిరుద్యోగుల జీవనోపాధి కోసం కేటాయించిన యూనిట్లు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని డీఆర్‌డీఏ పీడీ నజీర్ సాహెబ్ సూచించారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని యూనిట్ల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ మండలాలకు చెందిన బ్యాంక ర్లు, ఎంపీడీఓలు, ఐకేపీ ఏపీఎం, సీసీలతో మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీడీ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన జేఎంఎల్‌బీసీ సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఐదు నెలలుగా నిర్వహించడం లేదన్నారు. దీంతో ఎక్కడి పనులు నిలిచిపోయాయన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల కింద 2013-14 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన జీవనోపాధి యూనిట్లను త్వరిత గతిన మంజూరు చేసి వాటిని ప్రారంభించాలని సూచించారు. ఆయా బ్యాంకుల అధికారులు, ఎంపీడీఓలు యూనిట్ల విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కోవెలకుంట్ల స్టేట్‌బ్యాంక్ పరిధిలో 41, ఎస్‌బీహెచ్ పరిధిలో 19, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో 38, గోస్పాడు పరిధిలో 21 యూనిట్లను కేటాయించగా ఇప్పటి వరకు ఒక్కయూనిట్ కూడా ప్రారంభం కాకపోవడంపై పీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్వరమే చర్యలు తీసుకుని అర్హులైన వారికి లబ్ధీ చేకూర్చాలన్నారు.
డిసెంబర్‌లో ఆయా బ్యాంకులకు కేటాయించిన యూనిట్లన్నీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెల రెండో వారంలో జేఎంఎల్‌బీసీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌బీఎం ఆండవార్, బ్యాంకు ఉన్నతాధికారులు చంద్రశేఖర్‌రెడ్డి, ఫణికుమార్, తహశీల్దార్ సుధాకర్, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఎంపీడీఓలు, ఏపీజీబీ మేనేజర్లు సుజాతమ్మ, శ్రీలత, కేవీసుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, ఇందిరకాంత్రిపథం ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.
‘జీవనోపాధి’పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
Published Wed, Nov 20 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement