వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడాశిక్షణ | summer camp | Sakshi
Sakshi News home page

వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడాశిక్షణ

Published Sat, Feb 21 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

summer camp

మంత్రి రావెల కిశోర్‌బాబు
 కణేకల్లు: ‘గురుకుల పాఠశాలల్లో చదువుతోంది పేద విద్యార్థులే. వారిని వేసవి సెలవుల్లో ఇళ్లకు పంపితే కూలీలుగా మారతారు. పైగా కడుపు నిండా భోజనం కూడా తినలేరు. అందుకే ఇళ్లకు పంపకుండా క్రీడల్లో తర్ఫీదునివ్వాలని నిర్ణయించాము. స్పోకెన్ ఇంగ్లిష్, సంగీతం కూడా నేర్పిస్తామ ’ని   రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. కణేకల్లుక్రాస్‌లో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని  శుక్రవారం ఆయన ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా మాట్లాడుతూ  పాఠశాలల్లో న్యూట్రీషన్ ఎక్స్‌పర్ట్‌ను నియమించి మంచి ఆహారాన్ని అందిస్తూ డైట్ కంట్రోల్ చేస్తామన్నారు. ప్రతి గురుకుల పాఠశాలలో రూ.10 లక్షలు వెచ్చించి కంప్యూటర్ విద్యను అందిస్తామన్నారు.  గురుకుల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతామన్నారు.  ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు.  రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రం ఐటీ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోన శిశధర్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ధర్మవరం ఆర్డీఓ రామారావు, ఎంపీపీ  షేక్ ఫాతిమాబీ, జెడ్పీటీసీ సభ్యురాలు శారద, సర్పంచు కౌసల్య, ఉప సర్పంచు ఆనంద్, తహశీల్దార్ వెంకటశేషు, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ బారన్‌సాబ్ పాల్గొన్నారు.
 
 మాదిగ దళారులను తరిమికొట్టండి
 కళ్యాణదుర్గం: కొన్ని పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన దుర్మార్గపు మాదిగ దళారులను తరిమికొట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన  మాదిగల ఆత్మగౌరవ ర్యాలీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
 
  పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులు దోపిడీ గురయ్యారన్నారు. దళితుల భూములను లాక్కున్నారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌ను దళితులు భూస్థాపితం చేశారన్నారు. అనంతరం ఆయన వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేశారు.  ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అంశాన్ని తమకు వదిలివేయాలని, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందాలని సూచించారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి  పాల్గొన్నారు.
 
 మాఫీ ఎప్పుడో చెప్పండి
 ఉరవకొండ :‘సార్.. మీరు వూ కోసం ఏమీ చేయొద్దు.  ఎన్నికలప్పుడు చెప్పినవిధంగా దయుచేసి వూ బ్యాంకు రుణాలు వూఫీ చేయుండి చాలు’ అంటూ పలువురు రైతులు రాష్ట్ర సాంఘిక సంక్షేవు శాఖ వుంత్రి రావెల కిషోర్‌బాబును వేడుకున్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలోని కణేకల్లుకు వెళుతూ వూర్గవుధ్యంలోని ఉరవకొండలో ఆగారు. అంబేద్కర్ విగ్రహానికి పూలవూల వేసి నివాళులర్పించిన తర్వాత అక్కడే ఉన్న కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ‘వూ కడుపులు వుండుతున్నాయి. అప్పుల బాధతో అవస్థ పడుతున్నాం. రుణమాఫీ అయ్యేలా చూడండి’ అంటూ వాపోయారు. తర్వాత వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకారుులు  చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల జోక్యంతో వారి ప్రయత్నం ఫలించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement