జిల్లాలోని ముగ్గురు రెవెన్యూ అధికారులను సోమవారం కలెక్టర్ అహ్మద్ బాబు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో నిర్మల్ కేఆర్‌సీ తహశీల్దార్ జాడి శంకర్, గుడిహత్నూర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ గజానన్, గుడిహత్నూర్ వీఆర్‌వో లీలలు ఉన్నారు.
కలెక్టరేట్/గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ముగ్గురు రెవెన్యూ అధికారులను సోమవారం కలెక్టర్ అహ్మద్ బాబు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో నిర్మల్ కేఆర్‌సీ తహశీల్దార్ జాడి శంకర్, గుడిహత్నూర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ గజానన్, గుడిహత్నూర్ వీఆర్‌వో లీలలు ఉన్నారు. వీరు ముగ్గురు గుడిహత్నూర్‌లో పనిచేశారు. జాడి శంకర్ తహశీల్దార్‌గా, గజానన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు.
లీల ప్రస్తుతం కూడా గుడిహత్నూర్ వీఆర్‌వోగా పనిచేస్తోంది. వీరు పనిచేసిన కాలంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 98 భూ వివాదంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవోలతో విచారణ జరిపించారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ చేశారు.