ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : భవిష్యత్‌కు కీలకమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన ఆలస్యమవుతోంది. సిలబస్ పూర్తికాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. నవంబర్ నాటికే పాఠ్యాంశాల బోధన పూర్తిచేయాల్సి ఉండగా, డిసెంబర్ నెలాఖరుకైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో పాఠశాలలు 53 రోజులపాటు మూతపడ్డాయి. దీంతో బోధన పూర్తికాలేదు. ఒకేసారి పాఠాలన్నీ చదవాల్సి రావటంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై వత్తిడి పెరుగుతోంది. ప్రైవేటు విద్యాసంస్థలు ఒకవైపు స్కూళ్లు నడుపుతూనే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనగా.. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం మూతపడ్డారుు. దీంతో జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే సుమారు 44వేల మంది విద్యార్థులు తంటాలు పడుతున్నారు.
అదనపు బోధనా దినాలు గాలికి...
సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన 53 రోజులకు సంబంధించిన పాఠ్యాంశాలను బోధించేం దుకు వీలుగా ఉపాధ్యాయులు 33రోజులపాటు అదనంగా పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది ఉపాధ్యాయులు తాము ఉద్యమంలో పాల్గొనలేదని, ఇప్పుడు సెలవు రోజుల్లో పనిచేయాలంటే కుదరదని చెబుతున్నారు. కొందరైతే సెలవు రోజుల్లోనూ పనిచేస్తున్నామని చెబుతున్నా.. విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. నవంబర్ నెలలో సిలబస్ పూర్తిచేసి.. ఆ తరువాత అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహించి.. జనవరిలో పాఠ్యాంశాల పునశ్చరణ చేయాల్సి ఉంది. ఇవేమీ ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 465కు పైగా ఉండగా, ప్రైవేటు విద్యాసంస్థలు 350కు పైగా ఉన్నా యి. ప్రైవేటు స్ళూలో విద్యార్థుల పరిస్థితి బాగానే ఉన్నా, ప్రభుత్వ స్కూళ్ళలోని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైంది.
ప్రణాళిక వేశాం : డీఈవో
త్రైమాసిక పరీక్షలు నిర్వహించిన అనంతరం పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికను అమలు చేస్తామని ఆర్.నరసింహరావు చెప్పారు. ఇప్పటికే ఉదయం, సాయంత్రం పాఠశాలల వేళల గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జనవరి నుంచి పాఠ్యాంశాల పునశ్చరణ ప్రారంభి విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ చేసి వెనుకబడ్డ వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సీ, డీ గ్రేడ్ విద్యార్థులు ఏఏ సబ్జెక్టులో వెనుకబడ్డారో పరిశీలించి ఆయా సబ్జెక్టులో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఉత్తీర్ణతే ధ్యేయంగా కాకుండా పాఠ్యాంశాల అవగాహనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉండే ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
సిలబస్ లేటరుు్యంది
Published Tue, Dec 3 2013 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement
Advertisement