
సాక్షి, చిత్తూరు : తెలుగు తమ్ముళ్ల మరీ బరితెగించారు. తమకు ఎందుకు ఓటెయ్యరు అంటూ గ్రామస్థులపై దాడికి దిగారు. చంద్రగిరిలోని పణపాకంలో మూడు రోజులుగా దళితుల మీద తమ పార్టీకి ఓటెయ్యాలని టీడీపీ ఒత్తిడి పెడుతోంది. పసుపు-కుంకుమతో పాటు పింఛన్లు తీసుకుంటున్నారు కదా టీడీపీకి ఎందుకు ఓటు వెయ్యరంటూ దాడికి దిగారు. ఈ దాడిలో దాదాపు పది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ రుయాకు తరలించారు. అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా టీడీపీ నేతలు దాడికి దిగారు. సుబ్బు అనే జర్నలిస్ట్‌కు కూడా గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment