
చిత్తూరు: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యం తారాస్థాయికి చేరింది. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ నేతలు ఏమాత్రం వెనకాడటం లేదు. తంబళ్లపల్లి నియోజవర్గం పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుంలో టీడీపీ నేతల రాళ్ల దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు మృతిచెందారు. మృతుడు వెంకటరమణారెడ్డిగా గుర్తించారు. పోలింగ్ బూత్‌లో ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ నేతలను అడ్డుకోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.