రాష్ట్రంలో హత్యా రాజకీయాల పాలన | TDP Faction Politics In Andhra Pradesh Majji Srinivasa Rao | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో హత్యా రాజకీయాల పాలన

Published Tue, Oct 30 2018 7:27 AM | Last Updated on Tue, Oct 30 2018 7:27 AM

TDP Faction Politics In Andhra Pradesh Majji Srinivasa Rao - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మజ్జి శ్రీనివాసరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు

విజయనగరం, బలిజిపేట:  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో హత్యా రాజకీయాల పాలన సాగుతున్నదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహా రాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బలిజిపేటలో ఆ పార్టీ బూత్‌కమిటీ కన్వీ నర్లు, నాయకుల సమావేశం సోమవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అధికార పార్టీ ఆగడాలకు అంతం లేకుండా పోతుందని దీన్ని తుదముట్టించేందుకు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావలసి ఉందన్నారు. పార్టీ ఆధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖలో జరిగిన హత్యాయత్నం అరాచక పాలకు ఒక ఉదాహరణ అన్నారు.  పార్టీ నాయకులను అంతమొందించి పార్టీని నిర్వీర్యం చేస్తేనే టీడీపీకి బతికి బట్టకట్టే అవకాశాలున్నాయని గ్రహించిన అధికార పార్టీ ఏకంగా జగన్‌నే హత్య చేయాలని ప్రయత్నించిందన్నారు. ప్రజల ఆశీస్సులు ఉండడం వలన ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం కలగలేదన్నారు.  రిమాండ్‌ రిపోర్టులో విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్హా ఇది హత్యాయత్నమేన ని తెలిపారని పేర్కొన్నారు.

అటువంటి పరిస్థితుల నుంచి బయటపడి మొక్కవోని ధైర్యంతో జగన్‌ తిరిగి వచ్చే నెల 3నుంచి పాదయాత్రను నిర్వహించనున్నారన్నారు. అందులో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలోనే అడుగుపెట్టడం మనందరి అదృష్టమని తెలిపారు.  పార్వతీపురంలో పెట్టే బహిరంగ సభ ప్రతిష్టాత్మకంగా ఉండాలన్నారు.  జిల్లాలో సెప్టెంబరు 24న ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర ఇప్పటి వరకు ఏడు నియోజకవర్గాలలో పూర్తయిందని అక్కడ నిర్వహించిన సభలలో స్థానిక సమస్యలు తెలియపరిచారని అందుకు భిన్నంగా పార్వతీపురంలో నిర్వహించే సభలో అధికార పార్టీ తనపై చేసిన హత్యాయత్నంపై తెలియపరచనున్నారని, దీన్ని గుర్తించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు.  విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు. సమావేశంలో పార్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయర్త అలజంగి జోగారావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గర్భాపు ఉదయభాను, రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, పార్టీ సీనియర్‌ నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రాఘవకుమార్,  ఎస్సీ సెల్‌ కార్యదర్శి జి.లక్ష్మణ, బి.సత్యనారాయణమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్తా చాటుదాం...: పరీక్షిత్‌రాజు
పార్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి నవంబరు 4న పార్వతీపురంలో అడుగిడునున్న తరుణంలో ఘన స్వాగతం పలికి పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో బలిజిపేట మండలం నుంచి శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు.  నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు మాట్లాడుతూ హత్యాయత్నం అనందరం ప్రజలు, దేవుని దీవెనలతో తిరిగి యాత్రకు వస్తున్న జగన్‌కు అపూర్వ స్వాగతం పలకాలన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, పార్టీ సీనియర్‌ నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్, బి.సత్యన్నారాయణమూర్తి, జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శి కె.గౌరీశ్వరరావు, అసెంబ్లీ బూత్‌కమిటీ కన్వీనర్‌ జి.శ్రీరాములునాయుడు, జిల్లా కార్యదర్శి గోపినాయుడు, ఎంపీటీసీ ఎం.శ్రీరామూర్తి, పలగర సహకారం సంఘం అద్యక్షుడు జి.పకీరునాయుడు,  కో ఆపరేటివ్‌ డైరెక్టరు పాపారావు, మాజీ సర్పంచ్‌లు ఎ.ఎల్లంనాయుడు, ఎం.ప్రసాదు, ఎం.సాంభమూర్తి, జి.గంగయ్య, ఎన్‌వి.జగన్నాధం,  నీటి సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో పలువురి చేరిక
ఈ సందర్భంగా పలగరకు చెందిన యువకులు వావిలపల్లి చిన అప్పలనాయుడు, కె.లక్ష్మణరావు, ఎ.ప్రసాదు, బి.గణేష్, కె.రామారావు, కె.అనిల్, పి.శ్రీను  తదితరులు పార్టీలో చేరారు.  వీరికి జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌ రాజు, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement