Faction Politics
-
పుంగనూరులో ఫ్యాక్షన్ రాజకీయాలు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
-
అలజడులు సృష్టించేందుకు జేసీ బ్రదర్స్ యత్నం..
తాడిపత్రి అర్బన్: తాడిపత్రి... ఈ పేరు వింటే ఒకప్పుడు ఫ్యాక్షన్ హత్యలు.. ముఠా పోరు.. విధ్వంసాలు.. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా దాడులు.. ప్రతీకార జ్వాలల్లో దహనమయ్యే గడ్డి వాములు, గుడిసెలు, గృహాలు కళ్ల ముందు మెదలాడుతాయి. ఆధిపత్య పోరులో ఓ వర్గం సాగించిన దౌర్జన్యానికి మూడు దశాబ్దాలుగా తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ అతలాకుతలమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఏ ఎన్నికల చరిత్ర చూసినా పచ్చని పల్లెల్లో అల్లకల్లోలమే ఆవిష్కృతమవుతుందనేది బహిరంగ రహస్యం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేశారు. పోలీసు యంత్రాంగానికి పూర్తీ స్వేచ్ఛనిచ్చారు. దీంతో తాడిపత్రిపై ఇప్పటి వరకూ పడిన ఫ్యాక్షన్ ముద్ర కాస్త చెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో నెలకొన్న స్వేచ్ఛాయుత వాతావరణాన్ని చెడగొట్టి తమ ఆధిపత్యాన్ని కొనసాగించేలా జేసీ సోదరులు గ్రామాల్లో అలజడులు సృష్టించేందుకు తెరలేపారు. ఇందుకు ఇటీవల జేసీ సోదరుల సొంతూరు జూటూరులో జరిగిన దాడులే నిదర్శనం. జేసీ బ్రదర్స్ అడ్డాగా.. తాడిపత్రి పేరు వినగానే స్ఫురణకు వచ్చే పేరు జేసీ బ్రదర్స్ . 1982లో సమితి ప్రెసిడెంట్‌గా జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి మండలాల్లోని పలు గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఫ్యాక్షన్‌కు బీజం వేశారు. తాడిపత్రి మండలం హుసేనాపురంలో గృహ దహనాలు, పెద్దపప్పూరు మండలం తురకపల్లి, తాడిపత్రి మండలం వెలమకూరు గ్రామాల్లో హత్యోదంతాలు, ఇతర గ్రామాల్లో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో జేసీ సోదరుల ప్రమేయం ఉందన్న ఆరోపణలే ఇందుకు నిదర్శనం. 1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పెద్దపప్పూరు మండలంలోని పసులూరు గ్రామంలో మహిళల పోలింగ్ కేంద్రంలోకి జేసీ వర్గీయులు చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై అప్పటి పోలింగ్ విధుల్లో ఉన్న విశ్రాంత సైనికోద్యోగి ఫిర్యాదు మేరకు అప్పటి ఎన్నికల ఇన్చార్జ్ దోతాంగే (ఐపియస్ అధికారి).. జేసీ దివాకర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్యలూ లేవు. పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ కలి్పంచక పోవడంతోనే అప్పట్లో జేసీ సోదరుల ఆగడాలు పెచ్చరిల్లిపోయాయన్న విమర్శలు వినిపించాయి. 2004 నుంచి హ్యాట్రిక్ విజయాలతో తాడిపత్రి అడ్డాగా కొనసాగుతున్న జేసీ సోదరుల ఆధిపత్యానికి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయంతో చుక్కెదురైంది. సేవ్ తాడిపత్రి పేరుతో హైడ్రామా.. మూడు దశాబ్దాలుగా జేసీ సోదరుల ఆగడాలతో తాడిపత్రి వాసులు విలవిల్లాడారు. గ్రానైట్, ట్రాన్స్‌పోర్టు, మట్కా, పేకాట, కాంట్రాక్టులు, సిమెంటు ఫ్యాక్టరీలు... ఒకటేమిటీ తాడిపత్రిలో ప్రతిదీ ఆదాయ వనరుగా మార్చుకుని, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ప్రతి ఒక్కరూ వీరికి కప్పం చెల్లించారు. కాదని ఎదురు మాట్లాడిన వారి ఇంటికి కరెంటు, నీటి సరఫరా నిలిపి వేశారు. మున్సిపాలిటీ వాహనంలో చెత్త తీసుకొచ్చి వారి ఇంటి ముందు పోసి కక్షసాధింపులకు దిగేవారు. అద్దె ఇంట నివాసమున్న వారిని తక్షణమే ఖాళీ చేయించేవారు. అధికారం కోల్పోయిన తర్వాత జేసీ సోదరుల నోటి నుంచి వెలువడుతున్న మాటలు, వారు ఉపయోగించిన భాషను చూసి ప్రతి ఒక్కరూ ఛీదరించుకున్నారు. ఈ క్రమంలోనే తిరిగి తమ పట్టు నిలుపుకునేందుకు తాజాగా ‘సేవ్ తాడిపత్రి’ పేరుతో జేసీ ప్రభాకరరెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారు. పేరుకు సేవ్ తాడిపత్రి అయినా.. దీని వెనుక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు జేసీ ప్రభాకరరెడ్డి సాగిస్తున్న ప్రయత్నాలను తాడిపత్రి వాసులు పసిగట్టారు. జేసీ సోదరుల ఆగడాలపై పెద్దారెడ్డి పోరు.. తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేసీ సోదరుల ఆగడాలపైనే పోరుబాట సాగిస్తూ వచ్చారు. దీంతో పెద్దారెడ్డిని అప్పట్లో ఇబ్బందులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అక్రమంగా కేసులు మోపి, జైలుకు పంపించేందుకు ప్రయత్నించారు. అయినా పెద్దారెడ్డి వెనుకడుగు వేయక అలుపెరుగని పోరాటం చేశారు. ఇదే క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జేసీ సోదరులకు తగిన గుణపాఠం చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. -
ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇటీవల హత్యకు గురైన బొల్లాపల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించే పేరుతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గురువారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రాజకీయ యాత్ర చేశారు. దీనిని జయప్రదం చేసేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడ్డారు. భారీగా జన సమీకరణకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయినా కార్యకర్తలను తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడ్డారు. చదవండి: తుప్పల్లో టెంకాయ్.. మా బాబే! వారిని ప్రలోభాలకు గురిచేసి ఎలాగొలా లాక్కొచ్చారు. ఘటన జరిగిన 20 రోజుల తర్వాత పరామర్శ పేరుతో యాత్రచేస్తూ లోకేష్ అడుగడుగునా పూలమాలలతో సన్మానాలు చేయించుకోవడం విమర్శలకు దారితీసింది. బొల్లాపల్లికి గుంటూరు, నరసరావుపేట, వినుకొండ నుంచి నేరుగా మార్గం ఉన్నా అటు కాకుండా గుంటూరు, మేడికొండూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మీదుగా రూట్ నిర్ణయించారు. గుంటూరు, తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక రచించుకోవడం, ఎక్కడికక్కడ జనసమీకరణ చేసుకుని ప్రతి చోటా దండలు, పూలు వేయించుకోవడంతో టీడీపీ నవ్వులపాలైంది. ఫ్యాక్షన్, మైనింగ్ మాఫియాను వెంట పెట్టుకుని.. పక్కనే ఫ్యాక్షన్ , మైనింగ్ మాఫియా నేతలను పెట్టుకుని లొకేష్ పర్యటన ఆసాంతం నీతులు వల్లించారు. ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ ప్రగల్భాలు పలికారు. బొల్లాపల్లి చేరుకున్నాక కత్తితో బతికితే కత్తితోనే చస్తావంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించారు. బ్రహ్మారెడ్డిని చూస్తే ఉచ్చపోసుకుంటావంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లినీ అసభ్యంగా దూషించారు. బ్రహ్మారెడ్డి వల్లే పడగ విప్పిన ఫ్యాక్షన్ వాస్తవానికి ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్చార్జ్గా నియమించిన తర్వాతే మాచర్లలో మళ్లీ హత్యలు మొదలయ్యాయి. దీనికి తెలుగుదేశం అధిష్టానమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన జల్లయ్యపై 2014–19 మధ్యలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పది కేసులు నమోదయ్యాయంటే అతని గత చరిత్ర ఏంటో అందరికీ అర్థమవుతోంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బ్రహ్మారెడ్డి తల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె సొంత మండలంలో 15 ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. అందులో ఏడు హత్యల్లో బ్రహ్మారెడ్డి ఏ1 ముద్దాయి. ఫ్యాక్షన్ పేరుతో సొంత బాబాయ్‌ని చంపిన కేసులోనూ ఆయన ఏ1గా ఉన్నారు. హత్యకు గురైన జల్లయ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ కార్యకర్తను హత్య చేశాడు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువర్గాలను కూర్చోబెట్టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజీ చేశారు. బ్రహ్మారెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా వచ్చిన తర్వాతే మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పుతోంది. ఈ విషయాలన్నింటినీ మరుగున పెట్టి వైఎస్సార్ సీపీ మీద బురదజల్లడమే ధ్యేయంగా లోకేష్ చేసిన పరామర్శ యాత్ర ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ సాగడంతో టీడీపీ ప్రజల్లో మరింత అభాసుపాలైంది. -
జేసీ ఆరోగ్యం కాపాడుకో..
సాక్షి, తాడిపత్రి : వ్యక్తిగత స్వార్థంతో పచ్చటి గ్రామాల్లో చిచ్చు రగిల్చే విధానాలను మానుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. రైతులు ఒక్కప్పుడు అమ్మిన భూములను తిరిగి ఇప్పిస్తానంటూ మోసపూరిత రాజకీయాలకు తెరతీయడం సమంజసం కాదని అన్నారు. ఇది గ్రామాల్లో వర్గ కక్షలను ప్రేరేపించేలా ఉందని అన్నారు. మంగళవారం తాడిపత్రిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎకరానికి రూ.20 వేలు ఎక్కువ ఇప్పిస్తా కేవలం తన చుట్టూ జనం తిరిగేలా చేసుకునేందుకే భూముల వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తలదూర్చారని అన్నారు. ఒకసారి ఇతరులకు విక్రయించిన భూములను తిరిగి ఇప్పించడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. జేసీ సోదరులు వారి స్వగ్రామమైన జూటూరులో రైతుల పొలాల గట్లను డోజర్లతో చదును చేయించి ఎకరాకు రూ.30 వేలు ఇచ్చి దౌర్జన్యంగా భూములను లాక్కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ భూములకు ఎకరాకు రూ.20 వేలు ఎక్కువగా తానిప్పిస్తానని, వాటిని అదే రైతులకు ఇచ్చే త్యాగబుద్ధి ఉందా అంటూ సవాల్ విసిరారు. (మూడు అంశాలే ప్రామాణికం!) స్వచ్ఛందంగా అమ్ముకున్నారు గతంలో వంగనూరు, బొందెలదిన్నె గ్రామాల సమీపంలోని భూములను రైతులు స్వచ్ఛందంగా అమ్ముకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం గండికోట ముంపు గ్రామాల ప్రజలు తాడిపత్రిలో గృహాలు నిర్మించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, ఫలితంగా తాడిపత్రి ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులను మభ్య పెడుతూ గతంలో అమ్ముకున్న భూములను తిరిగి ఇప్పిస్తానంటూ గ్రామాల్లో చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. డబ్బు ఉంటే ఎవరైనా భూములను కొనుగోలు చేయవచ్చునని, అయితే ముందు అమ్మిన ధర కంటే ఎకరానికి రూ.20 వేలు, రూ.30 వేలు ఎక్కువ ఇస్తామనడం సరైన సంస్కృతి కాదని అన్నారు. మాయమాటలతో గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని మాజీ ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఆరోగ్యం కాపాడుకో.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసి ఉంటే వారిపై మాత్రమే కేసులు నమోదవుతాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబం«ధించి కర్ణాటకలోని అధికారులు లేఖలు రాయడం జరిగిందని, వారు స్పందించకపోవడంతో లోకాయుక్తలో ఫిర్యా దు చేసినట్లు గుర్తు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్, జఠాధర ఇండస్ట్రీస్ యజమానులుగా ఎవరైతే ఉంటారో వారిపైన మాత్రమే కేసులు నమోదు అవుతాయన్నారు. ఈ విషయంగా ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. -
రాష్ట్రంలో హత్యా రాజకీయాల పాలన
విజయనగరం, బలిజిపేట: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో హత్యా రాజకీయాల పాలన సాగుతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహా రాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బలిజిపేటలో ఆ పార్టీ బూత్‌కమిటీ కన్వీ నర్లు, నాయకుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అధికార పార్టీ ఆగడాలకు అంతం లేకుండా పోతుందని దీన్ని తుదముట్టించేందుకు వైఎస్సార్సీపీ అధికారంలోకి రావలసి ఉందన్నారు. పార్టీ ఆధినేత జగన్మోహన్రెడ్డిపై విశాఖలో జరిగిన హత్యాయత్నం అరాచక పాలకు ఒక ఉదాహరణ అన్నారు. పార్టీ నాయకులను అంతమొందించి పార్టీని నిర్వీర్యం చేస్తేనే టీడీపీకి బతికి బట్టకట్టే అవకాశాలున్నాయని గ్రహించిన అధికార పార్టీ ఏకంగా జగన్నే హత్య చేయాలని ప్రయత్నించిందన్నారు. ప్రజల ఆశీస్సులు ఉండడం వలన ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం కలగలేదన్నారు. రిమాండ్ రిపోర్టులో విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా ఇది హత్యాయత్నమేన ని తెలిపారని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి బయటపడి మొక్కవోని ధైర్యంతో జగన్ తిరిగి వచ్చే నెల 3నుంచి పాదయాత్రను నిర్వహించనున్నారన్నారు. అందులో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలోనే అడుగుపెట్టడం మనందరి అదృష్టమని తెలిపారు. పార్వతీపురంలో పెట్టే బహిరంగ సభ ప్రతిష్టాత్మకంగా ఉండాలన్నారు. జిల్లాలో సెప్టెంబరు 24న ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర ఇప్పటి వరకు ఏడు నియోజకవర్గాలలో పూర్తయిందని అక్కడ నిర్వహించిన సభలలో స్థానిక సమస్యలు తెలియపరిచారని అందుకు భిన్నంగా పార్వతీపురంలో నిర్వహించే సభలో అధికార పార్టీ తనపై చేసిన హత్యాయత్నంపై తెలియపరచనున్నారని, దీన్ని గుర్తించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు. సమావేశంలో పార్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయర్త అలజంగి జోగారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గర్భాపు ఉదయభాను, రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, పార్టీ సీనియర్ నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రాఘవకుమార్, ఎస్సీ సెల్ కార్యదర్శి జి.లక్ష్మణ, బి.సత్యనారాయణమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్తా చాటుదాం...: పరీక్షిత్‌రాజు పార్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్మోహన్రెడ్డి నవంబరు 4న పార్వతీపురంలో అడుగిడునున్న తరుణంలో ఘన స్వాగతం పలికి పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో బలిజిపేట మండలం నుంచి శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు మాట్లాడుతూ హత్యాయత్నం అనందరం ప్రజలు, దేవుని దీవెనలతో తిరిగి యాత్రకు వస్తున్న జగన్‌కు అపూర్వ స్వాగతం పలకాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, పార్టీ సీనియర్ నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్, బి.సత్యన్నారాయణమూర్తి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి కె.గౌరీశ్వరరావు, అసెంబ్లీ బూత్‌కమిటీ కన్వీనర్ జి.శ్రీరాములునాయుడు, జిల్లా కార్యదర్శి గోపినాయుడు, ఎంపీటీసీ ఎం.శ్రీరామూర్తి, పలగర సహకారం సంఘం అద్యక్షుడు జి.పకీరునాయుడు, కో ఆపరేటివ్ డైరెక్టరు పాపారావు, మాజీ సర్పంచ్‌లు ఎ.ఎల్లంనాయుడు, ఎం.ప్రసాదు, ఎం.సాంభమూర్తి, జి.గంగయ్య, ఎన్వి.జగన్నాధం, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో పలువురి చేరిక ఈ సందర్భంగా పలగరకు చెందిన యువకులు వావిలపల్లి చిన అప్పలనాయుడు, కె.లక్ష్మణరావు, ఎ.ప్రసాదు, బి.గణేష్, కె.రామారావు, కె.అనిల్, పి.శ్రీను తదితరులు పార్టీలో చేరారు. వీరికి జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
అధికార జులుం!
సాక్షి, విజయవాడ : జిల్లాలో అధికార పార్టీ జులుం పెరిగిపోయింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని వేధించటమే ధ్యేయంగా టీడీపీ శ్రేణులు గ్రామాల్లో ముందుకుసాగున్నాయి. వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు సహకారం అందిస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు మరింత చెలరేగిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు రగిలిస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకు అన్నీ తెలిసినా అధికార పార్టీ ఒత్తిళ్ల వల్ల మౌనం పాటిస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు కూడా నమోదు చేయడానికి వెనకాడుతున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. గత రెండు నెలల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలు 15కు పైగా ఉన్నాయి. ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హత్య చేశారు. 20 మందికి పైగా గాయపడ్డారు. పట్టించుకోని పోలీసులు నందిగామ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ మండలాల్లో కొద్ది రోజులుగా పచ్చ చొక్కాల నేతల అగడాలు అధికమయ్యాయి. గతంలో గొట్టుముక్కల గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి ఎన్నికల అనంతరం తొలగించారు. పోలీసుల పికెట్ లేకపోవడం వల్లే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారు. గతంలో అనేక సంఘటనలు జరిగిన ఇక్కడి రూరల్ పోలీసులు సీరియస్‌గా స్పందించలేదు. గతంలో పోలీసుస్టేషన్లోనే సీఐ, ఎస్ఐ ఎదుట గుదే వెంకటేశ్వరరావు అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేసిన పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఆదివారం అర్ధరాత్రి కూడా ఉప సర్పంచ్ ఆలోకం కృష్ణారావు ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి దిగిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ క్రమంలో కృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం అదే గ్రామానికి చెందిన జిల్లాలోని నూజివీడు రూరల్ ప్రాంతలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నూజివీడులో మే నెలలో వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి జరిగినా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు. -
ఏమవుతుందో..!
సాక్షి ప్రతినిధి, కడప: జమ్మలమడుగు...ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డ.. ఆ గడ్డపేరు చెప్పగానే జనం ఉలిక్కిపడేవారు.. నిత్యం చోటు చే సుకునే ప్రతీకారేచ్ఛ ఘటనలే ఇందుకు కారణం. అలాంటి చోట శాంతికుసుమాలు విరాజిల్లాలని సంకల్పించారు. అందుకు పదే ళ్ల కిందట బీజం పడింది. ఫ్యాక్షన్ నుంచి ఫ్యాషన్ వైపు మళ్లించేందుకు దృష్టి సారించారు. అందుకు తగ్గట్టుగా పారిశ్రామిక వృద్ధి సాధించారు. ఆర్థిక వనరులు పెంపొందించారు. ఫ్యాక్షన్ కనుమరుగైందనుకుంటున్న తరుణంలో ఆటవిక రాజ్యం తెరపైకి వచ్చింది. పోలీసు యంత్రాంగం జడుసుకునేలా ప్రత్యక్షదాడులు చోటు చేసుకుంటున్నాయి. అధికారం చేతిలో ఉందనే జులుం అధికమైంది. ప్రశాంత జీవనం సాగిస్తున్న సామాన్య ప్రజానీకం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా జమ్మలమడుగు నియోజకవర్గం రికార్డులకెక్కింది. ఫ్యాక్షన్ రాజకీయాలు రాజ్యమేలుతున్న ఆప్రాంతంలో అలాంటి పరిస్థితులు రూపుమాపాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. అభివృద్ధి సాధిస్తే ఫ్యాక్షన్ రూపుమాపొచ్చనే నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ప్రోత్సహించారు. జమ్మలమడుగు ఫ్యాక్షన్‌కు దూరమై ఫ్యాషన్ దిశగా పయనించాలనే నినాదంతో ఎమ్మెల్యే చర్యలు ఉండిపోయాయి. పదేళ్లుగా అధికారంలో ఉంటున్న ఆయన నియోజకవర్గం సమగ్రాభివృద్ధి దిశగా కృషి చేశారు. వెనుకబడ్డ వర్గాలకు చేయూతనందించారు. ఆర్థిక వనరులు పెంపొందించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సహకారంతో పారిశ్రామికాభివృద్ధి సాధించారు. ఫ్యాక్షన్‌తో ముడిపడిన జీవితాలకు ఆర్థిక వనరులు సమకూర్చడంలో సఫలమయ్యారు. ఆమేరకు పదేళ్లుగా జమ్మలమడుగు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక్కమారుగా తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి. విజృంభిస్తున్న తెలుగుతమ్ముళ్లు.... తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందనే ఏకైక కారణంతో స్థానిక దేశం నేతలు విజృంభిస్తున్నారు. పోలీసు యంత్రాంగం జడుసుకునేలా ప్రత్యక్షదాడులకు తెగబడుతున్నారు. ఈనెల 3,4 తేదీలలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న దాడులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఓవైపు పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తున్నా మరోవైపు వారిపై ప్రత్యక్షంగా రాళ్ల దాడులు కొనసాగాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నా, వేలాది మంది గుంపులుగా చేరి ప్రత్యక్షదాడులకు తెగబడ్డారు. పదేళ్లుగా జమ్మలమడుగులో ఇలాంటి వాతావరణం చోటు చేసుకోలేదు. ప్రశాంత జీవనానికి అలవాటు పడ్డ ప్రజానీకం ఒక్కమారుగా ఉలిక్కిపడింది. పాతరోజులు గుర్తుకు చేసుకుని బెంబేలె త్తుతున్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజలు తిరక్కముందే తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోయిన ఉందంతం జమ్మలబడుగు పట్టణ వాసుల మదిలో నిలిచిపోయింది. ఆదివారం నిర్వహించే చైర్మన్ ఎన్నికలో ఎలాంటి ఉపద్రవం ముంచుకు రానుందోనని భీతిల్లుతున్నారు. చట్టానికి సంకేళ్లు తెగేనా..... జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ చట్టానికి సంకేళ్లు వేసింది. నిబంధనల మేరకు 50శాతం కోరం ఉంటే ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రిసైడింగ్ అధికారి రఘునాథరెడ్డికి నేరుగా టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఎన్నికలు వాయిదా వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్నట్టుండి ఆర్డీఓ రఘునాథరెడ్డికి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం కూడా అదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతోనే చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినట్లు సమాచారం. ఆర్డీఓ రఘునాథరెడ్డి ఫోన్ కాల్‌లిస్టు బహిర్గతం చేయగల్గితే ఇది తెలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం నిర్వహించే చైర్మన్ ఎన్నికను ప్రశాంతంగా ముగించాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ప్రిసైడింగ్ అధికారి రామారావు ఏర్పాట్లు చేపట్టారు. కాగా అధికార పార్టీ ఇందుకు సహకరిస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పదేళ్లుగా కొనసాగుతున్న ప్రశాంత వాతావరణానికి భంగం లేకుండా చూడాల్సిన భాద్యత అధికారపార్టీ నేతలపై ఉంది. మరి ఏమేరకు అధికార యంత్రాంగానికి సహకరిస్తారో వేచి చూడాల్సిందే. -
తండ్రి బాటలో పరిటాల శ్రీరాం
దివంగత టీడీపీ నాయకులు పరిటాల రవి తనయుడు శ్రీరాం తండ్రి బాటలోనే పయనిస్తున్నట్టు కనబడుతున్నాడు. గతంలో ప్రత్యర్థి హత్యకు కుట్రపన్నిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అతడు తాజాగా మరో వివాదంలో ఇరుకున్నాడు. అనంతపురంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చిరునామాగా మారిన పరిటాల రవి తర్వాత రాజకీయాల్లో చేరి ప్రత్యర్థులను అణగదొక్కారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అరాచకాలు సృష్టించారు. టీడీపీతో అండతో తన శత్రువులను అడ్రస్ లేకుండా చేశారు. ఈ క్రమంలో 2005లో ప్రత్యర్థుల చేతిలో పరిటాల రవి హత్యకు గురయ్యారు. తండ్రి మరణంతో వెలుగులోకి వచ్చిన శ్రీరాం ఫ్యాక్షన్ దారిలో ముందుకు వెళుతున్నట్టు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసును పోలీసులు గతేడాది ఛేదించడంతో శ్రీరాం పేరు పతాక శీర్షికలకు ఎక్కింది. సుధాకర్‌రెడ్డిని చంపించేందుకు శ్రీరాం కుట్ర చేశారని కేసు కూడా పెట్టారు. అతడి తల్లి పరిటాల సునీత పాత్ర కూడా పోలీసులు దర్యాప్తు జరిపారు. తాజాగా తన వాహనాల్లో మారణాయుధాలు తరలిస్తూ శ్రీరాం పోలీసుల కంటపడడం సంచలనం సృష్టించింది. హత్యకేసులో నిందితులతో కలిసి అతడు ఈ ఆయుధాలు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు కన్నుగప్పి అతడు పారిపోయాడు. తల్లి తరపున ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీరాం మారణాయుధాలు తరలిస్తుండడం అనుమానాలను తావిస్తోంది. ప్రత్యర్థులను భయపెట్టి తన తల్లిని గెలిపించుకునేందుకే మారణాయుధాలు పట్టుకొస్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇవి ఎక్కడ నుంచి తెచ్చారు, ఎందుకు కోసం తీసుకెళుతున్నారు అనేది తేల్చాల్సింది పోలీసులే.