సాక్షి, విజయవాడ : జిల్లాలో అధికార పార్టీ జులుం పెరిగిపోయింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని వేధించటమే ధ్యేయంగా టీడీపీ శ్రేణులు గ్రామాల్లో ముందుకుసాగున్నాయి. వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు సహకారం అందిస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు మరింత చెలరేగిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు రగిలిస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకు అన్నీ తెలిసినా అధికార పార్టీ ఒత్తిళ్ల వల్ల మౌనం పాటిస్తున్నారు.
కొన్నిచోట్ల కేసులు కూడా నమోదు చేయడానికి వెనకాడుతున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. గత రెండు నెలల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలు 15కు పైగా ఉన్నాయి. ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హత్య చేశారు. 20 మందికి పైగా గాయపడ్డారు.
పట్టించుకోని పోలీసులు
నందిగామ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ మండలాల్లో కొద్ది రోజులుగా పచ్చ చొక్కాల నేతల అగడాలు అధికమయ్యాయి. గతంలో గొట్టుముక్కల గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి ఎన్నికల అనంతరం తొలగించారు. పోలీసుల పికెట్ లేకపోవడం వల్లే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారు. గతంలో అనేక సంఘటనలు జరిగిన ఇక్కడి రూరల్ పోలీసులు సీరియస్‌గా స్పందించలేదు.
గతంలో పోలీసుస్టేషన్‌లోనే సీఐ, ఎస్‌ఐ ఎదుట గుదే వెంకటేశ్వరరావు అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేసిన పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఆదివారం అర్ధరాత్రి కూడా ఉప సర్పంచ్ ఆలోకం కృష్ణారావు ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి దిగిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ క్రమంలో కృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం అదే గ్రామానికి చెందిన జిల్లాలోని నూజివీడు రూరల్ ప్రాంతలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నూజివీడులో మే నెలలో వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి జరిగినా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు.
అధికార జులుం!
Published Wed, Aug 13 2014 3:12 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement