ద్వారాపురెడ్డిపాలెంలో సర్వే బృందం తెచ్చిన ట్యాబ్‌లు చూపుతున్న మహిళలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, వృత్తంలో ఉన్నది సర్వే చేయడానికి వచ్చిన వ్యక్తి
విజయనగరం, డెంకాడ (నెల్లిమర్ల): ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితాల ను పొందుపరచుకుని, పలు అంశాలపై అభిప్రా య సేకరణపేరుతో గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్న వారితో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓటర్ల జాబితాల్లో కీలక నాయకులతో పాటు ప్రతిపక్షపార్టీకి చెందిన ఓట్లను పలుగ్రామాల్లో తొలగించిన నేపథ్యంలో ఇలాంటి సర్వేలు చేస్తున్న వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సర్వేకి వస్తున్న వారి వద్ద ఉన్న ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితా ఉంటుండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
ఓట్ల తొలగింపులో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారన పలువురు అంటున్నారు. చొల్లంగిపేట పంచాయతీలోని ద్వారపురెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం ఇంటింటికీ ట్యాబ్‌లు పట్టుకుని సర్వే పేరిట తిరిగారు. వారి ట్యాబ్‌లలో ఓటర్ల జాబి తాలు ప్రత్యక్షమవడంతో పాటు వారు అడిగే ప్రశ్నలు కూడా తేడాగా ఉండడంతో వీరిని డెంకా డ పోలీసులకు అప్పగించారు. అలాగే చింతలవలసకి కూడా కొందరు సభ్యులు సర్వే పేరిట వచ్చారు. వారి ట్యాబ్‌ల్లో కూడా ఓటర్ల జాబితా లు ఉండడంతో సర్వే చేయడం సరికాదని చెప్పడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వీరిలో కొందరు తమ వివరాలు కూడా చెప్పడం లేదు. కొందరు బెంగళూరుకు చెందిన పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ పేరిట ఐడెంటీ కార్డులు చూపుతున్నారు. వీటిల్లో సర్వే చేస్తున్న వ్యక్తుల ఫొటోలు లేవు.
పూర్తిస్థాయివిచారణ చేయాలి
సర్వేల పేరుతో వచ్చిన వారు అధికార పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెబుతున్న వారి ఓట్లను తొలగిస్తున్నారన్న ఆందోళన చాలా మందిలో ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డెంకాడ మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బంటుపల్లి వాసుదేవరావు పోలీసులను కోరారు. సర్వే బృందాల వద్ద ట్యాబ్‌లను పూర్తిస్థాయిలో పరిశీలించడంతో పాటు, వీరిని వెనుకనుంచి నడిపిస్తున్న వారిని కనిపెట్టి విచారిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నారు. పోలీసులు, ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment