సైకిల్‌కు బ్రేకులు | TDP Government Delayed Bicycle Distributors In Chittoor | Sakshi
Sakshi News home page

సైకిల్‌కు బ్రేకులు

Published Wed, Aug 15 2018 10:38 AM | Last Updated on Wed, Aug 15 2018 10:38 AM

TDP Government Delayed Bicycle Distributors In Chittoor - Sakshi

2016–17లో మంత్రి అమరనాథరెడ్డి చేతుల మీదుగా విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ (ఫైల్‌)

ప్రభుత్వ బడుల్లో ప్రతి విద్యార్థినికి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తాం... నడిచి సూళ్లకు వెళ్లే అవస్థలు తప్పిస్తామని టీడీపీ సర్కారు చెప్పింది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అవుతున్నా ఒక్కసారి మాత్రమే సైకిళ్లు అందజేసి చేతులు దులుపుకుంది.  జిల్లాలో చాలా గ్రామాలకు బస్సుల సౌకర్యం సరిగ్గా లేదు. బస్సు వెళ్లని గ్రామాలూ ఉన్నాయి.   కాలినడకన హైస్కూళ్లకు చేరుకోవడం విద్యార్థులకు దూరాభారమవుతోంది.  ప్రాథమిక స్థాయి వరకు చదివించి, దూరప్రాంతాలకు పంపే దారి లేక ఆడపిల్లలను మధ్యలోనే తల్లిదండ్రులు  చదువును నిలిపేస్తున్నారు.

చిత్తూరు ఎడ్యుకేషన్‌: బడికొస్తా పథకం కింద జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు టీడీపీప్రభుత్వం అధికారంలోకి వచ్పినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే సైకిళ్లను పంపిణీ చేసింది. 2016–17లో 9వ తరగతి  బాలికలకు సైకిళ్లను అందజేసింది. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో నడుస్తున్న పాఠశాలల్లో అప్పట్లో చదువుతున్న 16,722 మంది బాలికల కోసం సైకిళ్లను  పంపారు. ఆ సైకిళ్లను మండల కేంద్రాల్లో ఎంఈఓలకు అప్పజెప్పి  సంబంధిత హైస్కూల్‌ విద్యార్థి నులకు అందజేశారు. అప్పట్లో సైకిళ్లు పూర్తి స్థా యిలో అర్హులైన విద్యార్థినులకు అందలేదన్న వి మర్శలున్నాయి.  ఆధార్‌కార్డు, వెబ్‌సైట్‌లో ఫోటో ల అప్‌లోడ్‌ తదితర నిబంధనలు పెట్టడంతో చా లా మంది పేద విద్యార్థినులు సైకిళ్లను పొందలేకపోయారు. సరఫరా చేసిన సైకిళ్లను క్షేత్రస్థాయిలో అర్హులైన విద్యార్థినులకు అందజేశారా... లేదా అన్న అంశంపై విద్యాశాఖ పట్టించుకోలేదు. దీం తో పలు సైకిళ్లు పక్కదారిపట్టాయన్న ఆరోపణలు న్నాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు సైకిళ్ల  ఊసే లేదు.

పర్సంటేజీల కోసమేనా బాబు..
2016–17లో జిల్లాలో సరఫరా చేసిన సైకిళ్లు విద్యార్థుల కోసం అనుకుంటే పప్పులోకాలేసినట్లే... ఇక్కడే ఉంది అసలైన తిరకాసు.. సం బంధించి కొన్ని ప్రయివేట్‌ సంస్థలకు సైకిళ్లసరఫరా బాధ్యత అప్పజెప్పారు. అప్పట్లో చిత్తూరు జిల్లాకు హీరో కంపెనీకి సంబంధించిన సైకిళ్లను అందజేశారు. రాష్ట్రస్థాయిలో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా నాణ్యత లేని సైకిళ్లను అందజేశారు. ఆ∙సైకిళ్లు సంవత్సరం కూడా తిరక్కముందే పాడైపోయాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2016–17లో  చిత్తూరు డివిజన్‌లో 5,534 , పుత్తూరు డివిజన్‌లో 3,981, మదనపల్లె డివిజన్‌లో 4,258, తిరుపతి డివిజన్‌లో 2,949 మంది బాలికలకు సైకిళ్లను ఇచ్చారు. ఇందులో దాదాపు 40 శాతం సైకిళ్లు పక్కదారి పట్టాయని ఆరోపణలున్నాయి. కొన్ని సైకిళ్లను మూలపడేశారు. ఏ విద్యార్థినికి సైకిల్‌ ఇచ్చారో కూడా జిల్లా విద్యాశాఖ వివరాలు లేకపోవడం గమనార్హం. టీడీపీ సర్కారు బాధ్యతలు చేపట్టి ఐదో సంవత్సరం నడుస్తోంది. ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే నాణ్యత లేని సైకిళ్లను ఇచ్చి మిన్నకుండటం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు. కొత్త సైకిళ్లు వస్తాయని చాలామంది విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement