ఉద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌కార్డు
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఆసుపత్రులకు వెళ్లితే ఉచితంగా నగదు రహిత విధానంలో వైద్యం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 లో హైదరాబాదు రవీంద్రభారతిలో అట్టహాసంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి హెల్త్ కార్డులను కూడా జారీ చేశారు. అవన్నీ ఇచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్నా నేటికి పూర్తిస్థాయిలో కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్యానికి అమలుకు నోచుకోవడం లేదు. 2014కు ముందు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్ రియింబర్స్‌మెంట్ విధానం కొనసాగుతుండేది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండా ముందుగా నగదు చెల్లించి వైద్యం చేయించుకున్న తరువాత ఆయా శాఖలకు బిల్లులు సమర్పించి గ రిష్టంగా రెండు లక్షల వరకూ బిల్లులను పొందేవా రు. అయితే ఈ విధానం కాదని ఆసుపత్రులకు వెళ్లి న వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత చికిత్సా వి«ధానంలో వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హెల్త్‌కార్డులను జారీ చేశారు.
ఉద్యోగులు వేతనాల నుంచి రూ.350 కోట్లు జమ
2014 నవంబర్ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతనాల నుంచి ప్రతి నెలా నాన్ గజిటెడ్ ఉద్యోగులకు రూ. 90, గజిటెడ్ స్థాయి ఉద్యోగులకు 120 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ రకంగా వసూలు చేసిన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి దాదాపు రూ. 350 కోట్లు ప్రభుత్వానికి జమ అవుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా నేటికి కార్పొరేట్, సూపర్‌ప్సెషాలిటీ వైద్యశాలల్లో హెల్త్‌కార్డుల ద్వారా వైద్యం అందించడానికి ఆయా యాజమాన్యాలు నిరాకరిస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
చిన్న చిన్న ఆసుపత్రుల్లో అమలు
జిల్లా కేంద్రాల్లోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో దంత, కంటి సమస్యలతోపాటు చిన్నచిన్న శస్త్ర చికిత్సిలకు మాత్రమే వైద్యం చేస్తున్నారు తప్ప పెద్దవాటికి చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. క్యానర్స్, గుండె జబ్బు, కిడ్నీ మార్పిడి, కాలేయ సంబంధిత వ్యాధులకు రూ.5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ వ్యాధులకు హైదరాబాదు, చెన్నైలోని కార్పొరేట్, సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలల్లో హెల్త్‌కార్డులు చెల్లు బాటు కాకపోవడంతో ఉద్యోగులు ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విధంగా ఖర్చు చేసుకున్న వారు మెడికల్ రియింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు బిల్లుల మంజూరుకు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా చితికిపోయే çపరిస్థితి నెలకుంటోందని వారు వాపోతున్నారు.
జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లా వ్యాప్తంగా దాదాపు 35 వేల మంది దాగా ఉన్నారు. వీరందరూ నెలకు ఒకొక్కరు రూ. 90, 120 మేర ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా ఐదేళ్ల ఏళ్ల నుంచి ప్రభుత్వానికి డబ్బులు చేస్తున్నా సరైన వైద్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని రకాల వ్యాధులకు..
అన్ని రకాల వ్యాధులకు నగదు లేకుండా వైద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. క్యానర్స్, కిడ్ని, కాలేయ మార్పిడి వంటి పెద్ద పెద్ద వ్యాధులకు కూడా వైద్యం నిరాకరించకుండా ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా వెంటనే వైద్యం చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. – ఎ. శ్యాసుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment