టీడీపీ నేతలను అరెస్టు చేయాలి | TDP leaders should be arrested | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలను అరెస్టు చేయాలి

Published Thu, Jan 18 2018 6:57 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

TDP leaders should be arrested

విజయనగరం ఫోర్ట్‌: సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్వర్వులను ఉల్లంఘించి కోడి పందాలు నిర్వహించిన  తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏపీ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకష్ణ డిమాండ్‌ చేశారు. స్థానిక గో సంరక్షణ సమాఖ్య కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 రాష్ట్రంలో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విశాఖపట్నం రూరల్లో ప్రాంతాల్లో మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తదితరులు తమ జిల్లాల్లో స్వయంగా కోడి పందాలు ప్రారంభించడం కోర్టు ధిక్కార నేరం కిందకు వస్తుందన్నారు. వీరిపై 1960 జంతుహింస నివారణ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కోడి పందాలను అరికట్టాల్సిన  కలెక్టర్లు, ఎస్పీలు చోద్యం చూడడం దారుణమన్నారు.  సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు సత్యనారాయన, ధనాల రాంబాబు, బంగారి అప్పారావు, మామిడి రామారావు తదితరులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement