మామిడిపల్లి సమీపాన కోడిపందేలను తిలకిస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భంజ్‌దేవ్ తదితరులు
విజయనగరం, సాలూరురూరల్: కోడిపందేలు నిర్వహించరాదని, ఎక్కడైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా పలుచోట్ల పందేలు యథేచ్ఛగా సాగిపోయాయి. ఏటా హెచ్చరికలు చేస్తున్న పోలీసులు బాధ్యులపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా తూతూమంత్రంగా వ్యహరించడం వల్లే పందెం రాయుళ్లు తమపని తాము చేసుకుపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది కూడా సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో అనేకచోట్ల కోడిపందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సాలూరు మండలం మామిడిపల్లి పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహించారు. లక్షల్లో బెట్టింగులు నడిచాయి. సాక్షత్తూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌పీ భంజదేవ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు కూడా కోడిపందాల్లో పాల్గొన్నారని తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment