ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డి ( ఫైల్ ఫోటో)
సాక్షి, కదిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డిపై కదిరి పట్టణంలోని సిరి ఫ్యాషన్స్ దుస్తుల వ్యాపారి, టీడీపీ కార్యకర్త అయిన సిరి బాబయ్య ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగ్ పెట్టాడు. దాన్ని వెంటనే తొలగించాలని కోరిన గాండ్లపెంట మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సూర్యశేఖర్‌ను శనివారం దుకాణం వద్దకు పిలిపించి దాడి చేశాడు. దీనిపై పోలీసులు తనను అరెస్ట్ చేస్తారనే భయంతో తననే కత్తితో పొడవడానికి సూర్యశేఖర్ వచ్చాడంటూ దుకాణంలో ఉన్న అద్దాన్ని పగలగొట్టి హైడ్రామా ఆడాడు.
ఆ సమయంలో అద్దం తగిలి దుకాణంలో పనిచేసే ప్రభాకర్ అనే యువకుడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని వెంటనే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు తెలియజేస్తే... ఆయన దీన్ని పారీ్టకి అనుకూలంగా మార్చుకోవాలని అరగంట సేపు ఆ దుకాణం ముందు రహదారిపై ధర్నాకు దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు కత్తులతో దాడి చేశారంటూ నానా యాగీ చేశారు. కొంతమందిని వెంట బెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి అక్కడ కూడా హైరానా చేశారు. కత్తితో దాడి చేశారంటూ వైఎస్సార్‌సీపీ నాయకుడిపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు అందజేశారు. తనపై దాడిచేసి.. తానే కత్తితో పొడిచానని టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయడం బాధాకరమని బాధిత వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘన
ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో 30 పోలీస్ యాక్టు అమలులో ఉందని, రాజకీయ పార్టీ నాయకులు గానీ లేదంటే ఇంకెవరైనా సరే ధర్నాలు, రాస్తారోకోలు చేయాలంటే తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలని మూడు రోజుల క్రితమే డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ హెచ్చరించారు. అయితే టీడీపీ ఇన్‌చార్జ్ కందికుంట పోలీసుల అనుమతి లేకుండానే రోడ్డుపై ఎలా ధర్నాకు దిగుతారని పట్టణ ప్రజలు ప్రశి్నస్తున్నారు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు ఇంకా పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment