ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయి.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను పొట్టనపెట్టుకున్నా అధికార పార్టీ ఆగడాలు ఆగడం లేదు. తాజాగా పశ్చిమగోదారి జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్యకు టీడీపీ నాయకుడు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది.
దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కొత్తపల్లి రమేశ్‌ను హత్య చేయించేందుకు టీడీపీ ఎంపీటీసీ శోభన్‌బాబు కుట్ర పన్నారు. ఇందుకోసం బహ్మానందం అనే రౌడీషీటర్‌తో ఒప్పందం కుదుర్చుకుని, అతడికి 25 వేల రూపాయలు చెల్లించారు. అయితే బహ్మానందం మనసు మార్చుకోవడంతో ఈ కుట్ర బహిర్గతమైంది. విషయం తెలుసుకున్న రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.