ఆటే లేనప్పుడు బంతి ఎక్కడిది?: కోదండరాం
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెడుతున్న కిరికిరి ఈనెల 23వరకేనని, ఆ తర్వాత పార్లమెంటులో తెలంగాణబిల్లు ఆమోదం పొందుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. మైదానంలో ఆటే లేనప్పుడు బ్యాట్, బాల్ ఎక్కడిదని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీమాంధ్ర నేతలు బిల్లునుచింపి, భోగి మంటల్లో కాల్చినంత మాత్రాన రాష్ట్రఏర్పాటు ఆగిపోద న్నారు. జయశంకర్ త్యాగఫలితమే ఈనాటి తెలంగాణ అన్నారు. కిరణ్ ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఇంటిపేరు నల్లారి, ఊరిపేరు కలిగిరి, పెట్టేది కిరికిరి అని ఎద్దేవా చేశారు.