సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు గత శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావడం టీఆర్ఎస్, టి.జేఏసీలను కలవరపరుస్తోందని విజయవాడ నగర సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్టు వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణవాదులు దాడులు చేస్తున్న, రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చూస్తుంటే ఇది హైదరాబాదా లేక పాకిస్థానా అని ఆందోళన పడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో శాంతియుతంగా జరిగే సభలను అడ్డుకోవడం సరికాదని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఇప్పటికి చెప్పకుండా యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది ఆత్మగౌరవ యాత్ర కాదు... ఆత్మవంచన యాత్రగా మల్లాది విష్ణు అభివర్ణించారు.