
ఐరాల: చిత్తూరు జిల్లా ఐరాల మండలం మిరియం గంగనపల్లెకు చెందిన యువకుడు అమెరికాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన పత్తిపాటి ఉమాపతి నాయుడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డాడు. ఆయన కుమారుడు వివేక్ (28) అమెరికాలోని నార్త్ కెరోలిన స్టేట్ యూనివర్శిటీలో ఎమ్‌ఎస్ చదివేందుకు ఆరు నెలల క్రితం వెళ్లాడు. ప్రమాదవశాత్తూ శుక్రవారం 11.55 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం) యూనివర్శిటీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక్ మృతదేహాన్ని బుధవారం మిరియంగంగనపల్లెకు తరలించనున్నారు.