
గ్రామ సచివాలయం
సాక్షి, భీమవరం (ప్రకాశం చౌక్): ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటుచేయడం ద్వారా గ్రామంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు చూపిస్తాం.. పెన్షన్, రేషన్, ఇల్లు వంటి తదితర సమస్యలను 72 గంటల్లో పరిష్కరిస్తాం.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకానికి అన్నివర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ సచివాలయం ఏర్పాటు గొప్ప ఆలోచన అని పలువురు అంటున్నారు.
తీరనున్న పేదల కష్టాలు
గ్రామాల్లో పేదలు పెన్షన్, రేషన్ కార్డు, ఇల్లు తదితర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి సమయం పడతుంది. సమయానికి రేషన్ రాక, పెన్షన్ మంజూరు కాక ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఇక గూడు కోసం ఎదురుచూసే నిరు పేదలు మరెందరో ఉన్నారు. పేదల కష్టాలు తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయం అనే పథకాన్ని ప్రకటించారు. పేదలు దరఖాస్తు అందించిన 72 గంటల్లోపు సమస్యలు పరిష్కరించనున్నారు. ఈ పథకం ద్వారా అన్నివర్గాలకు మేలు జరుగుతుందని పలువురు అంటున్నారు.
10 మందికి ఉద్యోగులు
జాబు రావాలంటే.. బాబు రావాలి అని నిరుద్యోగులను సీఎం చంద్రబాబు నిండా ముంచారని యువత మండిపడుతోంది. ఈనేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయం ఏర్పాటు ప్రకటన వీరికి ఎంతో ఊరటనిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి అదే గ్రామంలో చదువుకున్న 10 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం చాలా బాగుందని అంటున్నారు. గ్రామంలో 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీర్‌గా నియమంచి వారికి రూ.5 వేలు జీతం ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. వైఎస్ జగన్ హామీ తమకు పూర్తి భరోసానిచ్చిందని నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తోంది.
జిల్లా వివరాలు
పంచాయతీలు : 909
గ్రామాలు : 2,500
గ్రామ సచివాలయం ద్వారా ఉద్యోగాలు : 9,090
గ్రామ సచివాలయం బాగుంది
జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన గ్రామ సచివా లయం ఏర్పాటు అనే పథకం చాలా గొప్పగా ఉంది. ఈ పథకం అమలు చేస్తే చదువుకున్న మాలాంటి వారికి ఉద్యోగులు వచ్చి కుటుంబాలు బాగుపడతాయి. గ్రామంలోని పేదల సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయి.
– చింతపల్లి హరి, ఉత్తరపాలెం కొణితివాడ
గ్రామంలోనే అన్ని పనులు
పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉపాధి హమీ పథకం కార్డుల కోసం మండల కేంద్రాలకు వెళ్లి అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. గ్రామంలోనే అన్నిపనులు సకాలంలో పూర్తిచేసేలా జగన్ గ్రామ సచివాలయం ఏర్పాటు ప్రకటన చాలా బాగుంది. పేదలకు మేలు జరుగుతుంది.
– అరటికట్ల వీరాస్వామి, కొండేపూడి పాలకోడేరు
10 మందికి ఉద్యోగాలు
గ్రామా సచివా లయం ఏర్పాటు చేస్తే అన్ని గ్రామాల్లో చదువుకున్న యువతలో 10 మందికి వారు ఉంటున్న గ్రామంలో ఉద్యోగాలు లభిస్తా యి. దీంతో కొంతవరకు నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఆయా గ్రామాల ప్రజలకు సేవ చేసే భాగ్యం యువతకు దక్కుతుంది.
–ఎ.సురేష్, నిరుద్యోగి, భీమవరం
72 గంటల్లోనే మంజూరు
జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన గ్రామ సచివాలయం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజ లకు మేలు జరుగుతుంది. పేదల అవసరాలను 72 గంటల్లో నే పూర్తిచేయడమనేది చాలా గొప్ప విషయం. చంద్రబాబు పాలనలో రేషన్‌కార్డు రావాలంటేనే ఏళ్ల పాటు సమయం పడుతుంది.
– పాలా సురేష్, రామచంద్రపురం
Comments
Please login to add a commentAdd a comment