దళితుల ఆందోళన..కొవ్వాడలో ఉద్రిక్తత | Tension in Kovada protesting Dalith land issue | Sakshi
Sakshi News home page

దళితుల ఆందోళన..కొవ్వాడలో ఉద్రిక్తత

Published Thu, Sep 7 2017 1:27 PM | Last Updated on Tue, Oct 30 2018 4:56 PM

Tension in Kovada protesting Dalith land issue

సాక్షి, విజయనగరం: జిల్లాలోని పూసపాటి రేగ మండలం కొవ్వాడలో ఉద్రిక్తత నెలకొంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడుకి కేటాయించిన భూముల్లో దళితులు ఆందోళన చేపట్టారు. దళితులకు కేటాయించిన భూములను ఎమ్మెల్యేకు కట్టబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భూముల చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలిగించారు.
 
పోలీసులు దళితులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యేకు చెందిన ఎస్‌వీస్‌ కెమికల్స్‌ కంపెనీ కోసం ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇది దళితులకు కేటాయించిన భూమి అని వారు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement