
తిరుపతి రూరల్: పవన్ కల్యాణ్‌కి దమ్ముంటే రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి సవాల్ విసిరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఆదివారం ఆయన మొక్కలు నాటారు. పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరు, ఎవరితో, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్‌సీపీని ఓడించలేరని స్పష్టం చేశారు.
కులం పేరు చెప్పుకొని ఓట్లడుగుతున్న పవన్‌కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసి తానేంటో నిరూపించుకోవాలన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేంటని, పెట్టుకోకపోతే తమకేంటని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సింహం అని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment