
శాంతి యుతంగా ర్యాలీ తీస్తున్న కౌలు రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంతో
విజయవాడ: నగరంలోని ఎంబీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వామపక్షాలు తలపెట్టిన ‘ఛలో అమరావతి’ భగ్నమైంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలంటూ సీపీఎం, సీపీఐ, జనసేన నాయకులు శనివారం ఛలో అమరావతికి పిలుపునిచ్చారు. దీంతో ఎంబీ భవన్ వద్దకు సర్కార్ పోలీసుల్ని భారీగా మోహరించింది. శాంతి యుతంగా ర్యాలీ తీస్తున్న కౌలు రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, కౌలు రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకే కొమ్ము కాస్తూ కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తుందని కౌలు రైతులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.