పదోతరగతి పరీక్షలకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. విద్యార్థులు ఎటువంటి ఒత్తిళ్లకు గురికాకుండా సన్నద్ధులు కావాలని కోరుతోంది. గంట ముందుగానే నిర్దేశిత కేంద్రాలకు వారు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని డీఈవో చంద్రమోహన్ సూచించారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులు పటిష్ట రంగం సిద్ధం చేశారు. అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు వీలుగా సంబంధిత కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ నేపథ్యంలో డీఈవో వై.చంద్రమోహన్ ‘న్యూస్‌లైన్’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఇలా...
ప్రశ్న : జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారు? పరీక్షా కేంద్రాలు ఎన్ని ?
జవాబు..: జిల్లా వ్యాప్తంగా 250 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. 47,021మంది రెగ్యులర్, 5,440 మంది ప్రైవేటు మొత్తం 52,461 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
ప్ర : ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?
జ..: విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న 250 కేంద్రాలలో పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఫర్నిచర్ కొరత ఉన్న కేంద్రాలలో ఇతర స్కూళ్ల నుంచి తెప్పించి సమకూర్చుతున్నాం. ప్రతీ కేంద్రంలో నీటి సౌకర్యం, వైద్యసదుపాయాలను కల్పిస్తాం. విద్యార్థులు నీళ్ల బాటిళ్లు తెచ్చుకుంటే మంచిది.
ప్ర : హాల్‌టికెట్లు ఇవ్వని ప్రైవేటు పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
జ..: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించపోయిన విద్యార్థులకు ఖచ్చితంగా హాల్‌టికెట్లు ఇవ్వాలి. ఇబ్బందులకు గురి చేసే పాఠశాలల యాజమన్యాలపై చర్యలు తప్పవు. ఒక వేళ పాఠశాలల్లో హాల్‌టికెట్ ఇవ్వకుంటే ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ వెబ్‌సైట్ ద్వారా పేరు, పుట్టిన తేది, పాఠశాల పేరు కొడితే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని ప్రధానోపాధ్యాయుని సంతకం లేకున్నా పరీక్షలకు హాజరు కావచ్చు.
ప్ర ..: పరీక్షల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు...?
జ..: 250 పరీక్షా కేంద్రాలలో 250మంది వంతున చీఫ్ సూపరింటెండెంట్లు, 250మంది డిపార్టుమెంటల్ అధికారులు, 3,200మంది ఇన్విజిలేటర్లు, 12 ప్లైయింగ్ స్క్వాడ్‌లు ఉంటాయి. ఫైయింగ్ స్క్వాడ్‌లలో విద్యా, పోలీసు, రెవెన్యూశాఖలకు చెందిన 12మంది సభ్యులు ఉంటారు.
ప్ర ..: పరీక్ష రాసే విద్యార్థులకు మీరిచ్చే సూచనలు..?
జ ..: పరీక్ష ఉదయం 9.30గం’’ల నుంచి 12గం’’ల వరకు ఉంటుంది. విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. తమ వెంట ప్యాడ్‌లు, పెన్నులు తెచ్చుకోవాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తెచ్చుకోరాదు. హాల్‌టికెట్ చూపి ఆర్టీసి బస్సులో వారు ఉచితంగా ప్రయాణించవచ్చు.
ప్ర ..: మాస్ కాపీయింగ్ నివారణకు ఎ లాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
జ..: దీనిపై అధికారులకు స్పష్టమైన ఆ దేశాలు జారీ చేశాం. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన మెయిన్‌గేట్లకు తాళం వేయరాదు. విద్యార్థులుకు ప్రశాంత వాతావరణం కల్పించాలి.
‘పది’లంగా... పరీక్షలు
Published Wed, Mar 26 2014 4:22 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement