ఇదేం.. సం‘దేశం’! | the arrival of message from tdp headquters | Sakshi
Sakshi News home page

ఇదేం.. సం‘దేశం’!

Published Sat, Dec 13 2014 12:46 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM

ఇదేం.. సం‘దేశం’! - Sakshi

ఇదేం.. సం‘దేశం’!

* పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు ధన్యవాదాలు
* వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాజాకు టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి మెసేజ్ రాక

తుని : అధినేత మెప్పు కోసమో....ప్రజలను ఏమార్చేందుకో కానీ తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రుణ మాఫీ పథకం, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇలా ప్రభుత్వ పథకాలు కావాలంటే పార్టీ సభ్యత్వం తీసుకోవాలని బలవంతం చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఏకంగా వైఎస్సార్ సీపీకి చెందిన తుని శాసన సభ్యులు దాడిశెట్టి రాజా టీడీపీ సభ్యత్వం తీసుకున్నందుకు ధన్యవాదాలంటూ టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి మెసేజ్ రావడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

టీఆర్-టీ-2850-68381 నంబర్‌తో టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని డీఎం-టీడీపీఓఎఫ్‌సీ పేరిట ఎమ్మెల్యే రాజా ఫోన్‌కు శుక్రవారం మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ‘సాక్షి’కి వివరించారు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని ప్రచారం చేసుకోడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమని పలువురు ముక్కున వేలేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement