వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : రాజకీయ పక్షాల జెండాలు మోసినంత కాలం బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతుందని వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ ఎం.ఎన్.రావు అన్నారు. జెండాపట్టే మనస్తత్వం పోతేనే నాయకులవుతారని పేర్కొన్నారు. జెండాలు మోసే వారు మోస్తూనే ఉంటారని... అగ్రకుల నాయకులు, వారి కొడుకులు, అల్లుళ్లు, చివరకు మనుమలు నాయకులుగా వస్తారని హెచ్చరించారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరగనున్న బీసీల ఆత్మగౌరం, బీసీ డిక్లరేషన్ జాతీయ స్థాయి సమావేశం శనివారం ప్రారంభమైంది.
ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎన్.రావు మాట్లాడుతూ దేశంలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్నారు. రాజ్యాధికారం రావాలంటే రాజకీయ పార్టీ అవసరమని.. అరుుతే ప్రస్తుతం ఆ స్థితి లేదన్నారు. కర్నాటకలో సిద్ధరామయ్య బీసీ వర్గాలను కలుపుకుని పోయారని గుర్తు చేశారు. ఇప్పుడున్న పార్టీల్లో బీసీలకు తగిన వాటా, ప్రాధాన్యం లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా జనాభా దామాషా ప్రకారం బీసీలకు అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాలనే ఒత్తిడి పెంచితే, ఏ పార్టీ నుంచైనా 100 నుంచి 150 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం ఉందన్నారు.
సామాజిక న్యాయం ప్రశ్నార్థకం
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల సామాజి క న్యాయం ప్రశ్నార్థకంగా మారుతోందని జస్టిస్ ఎంఎన్.రావు అన్నారు. 50 శాతం మంది సంపన్నులు, మరో 50 శాతం మం ది దరిద్రులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తలసరి ఆదాయాన్ని లెక్కి స్తే పైకి బాగానే కన్పించినా... కొందరు 90 శాతం ఆదాయాన్ని పొందితే మరికొంద రు 10 శాతం కూడా దక్కించుకోలేకపోవ డం అందులో దాగి ఉన్న మర్మమని వివరించారు. సగం కాలిఫోర్నియాగా మారితే సగం ఆఫ్రికా ఏడారిగా మారుతుందని అ మర్త్యసేన్ చెప్పిన అంశాలను ఉదహరిం చారు. ప్రపంచీకరణ ముసుగులో బడుగువర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు.
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి
ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో మాత్రమే రి జర్వేషన్లు అమలు చేస్తున్నారని ఎంఎన్.రావు వివరించారు. ప్రైవేట్ రంగంలో రిజ ర్వేషన్లు అమలు చేయకుంటే రానున్న రోజుల్లో బీసీ వర్గాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. ప్ర భుత్వ రాయితీలు, బ్యాంకుల పెట్టుబడు లు, వనరుల కల్పనతో ఏర్పాటవుతున్న ప్రైవేట్‌రంగంలో కచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
ఆర్థికాభివృద్ధిపై లోతుగా ఆలోచించాలి
బీసీల్లో ఆర్థిక పురోగతి లేదని, ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వెనుకబడి ఉన్నారని ఎంఎన్.రావు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన పెట్టుబడులన్నీ అగ్రకులాలకే చెందుతున్నాయని, బ్యాంకులు కూడా వారికే అప్పులిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారం, పెట్టుబడులు, అప్పు లు లేకుండా ఏ ప్రైవేట్ వ్యవస్థ కొనసాగడం లేదని వివరించారు. వెనుకబడిన వ ర్గాలకు అప్పులివ్వడం నిరర్ధకమనే భావన బ్యాంకుల్లో నెలకొందన్నారు. ఆర్థికాభివృద్ధి చెందకుండా బీసీలు ఎలా ముందుకు సా గుతారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని లోతు గా ఆలోచించాలన్నారు.
న్యాయవ్యవస్థలోనూ అగ్రకులాలే..
న్యాయవ్యవస్థలో కూడా అగ్రకులాలదే అ ధికారం కొనసాగుతోందని జస్టిస్ ఎంఎన్.రావు అన్నారు. మెజార్టీ జడ్జీలు అగ్రకులాలకు చెందిన వారేనని వివరించారు. ఏ రంగంలో ఉన్నా... బీసీలు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రా జకీయ రంగంలో బీసీలను అగ్రకులాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. బీసీ ల హక్కుల కోసం పనిచేసే నిజాయితీ గల నాయకులు అవసరమన్నారు. రాజ్యాధికారం దక్కించుకునేందుకు బీసీలు ఐక్యం గా ముందుకు సాగాలన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో ఐక్యత సాధించాలన్నారు. సమావేశానికి అకాడమీ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ (ఏ బీసీడీఈ) అధ్యక్షుడు డాక్టర్ మురళీమనోహర్ అధ్యక్షత వహించగా మంత్రి బస్వరాజు సారయ్య, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు నరేందర్‌బాబు, రవీందర్, సారంగపాణి, బొబ్బిలి, కూరపాటి వెంకటనారాయణ, తిరుమలి, విశ్వేశ్వర్‌రావు, బీసీ ప్రజాసంఘాల నాయకులు సాంబశివరా వు, డాక్టర్ బండాప్రకాష్, తిరునహరి శేషు, కులసంఘాల నాయకులు వేణుమాధవ్, పులిసారంగపాణి, గోపు సుధాకర్, అశోక్‌కుమార్, తాడిశెట్టి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ముగింపు.. డిక్లరేషన్ ప్రకటన
Published Sun, Sep 15 2013 4:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement