రాష్ట్రంలో ‘స్వైన్’ విహారం | The 'swine' Excursion | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ‘స్వైన్’ విహారం

Published Tue, Feb 3 2015 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

The 'swine' Excursion

  • వ్యాధితో ఇప్పటి వరకు ఐదుగురి మృతి
  • మరో 36 స్వైన్ ఫ్లూ కేసులు
  • నివారణే మార్గమంటున్న వైద్యులు
  • వ్యాధి అదుపులోనే ఉంది: ఆరోగ్యశాఖ
  • నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
  • సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ స్వైన్‌ఫ్లూ(హెచ్1 ఎన్1) కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 స్వైన్ కేసులు నమోదు కాగా ఈ వ్యాధితో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వైన్ బాధితుల జాబితాలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా చేరారు. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ఉధృతి పెరుగుతోందని గ్రహించిన సీఎం చంద్రబాబు మంగళవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టనున్నారు.
    వాస్తవానికి ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి తగ్గుతుందని, అయితే, రాష్ట్రంలో రోజురోజుకూ హెచ్1ఎన్1 కేసులు పెరుగుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని నివారణే మార్గమని సూచిస్తున్నారు. ఇక, రాష్ట్రంలో పరిస్థితి ఇలావుంది..
     
    విశాఖలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో సోమవారం కొత్తగా 4 స్వైన్‌ప్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఉత్తరాంధ్ర పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరుకుంది. మరోపక్క, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళానికి వచ్చిన ఓ యువకుడిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్టు గుర్తించారు.

    వైఎస్‌ఆర్ జిల్లాలో ముగ్గురు స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారు. వీరిని హైదరాబాద్‌కు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన షేక్ మస్తాన్ వలీ(10) అనే బాలుడు స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో హైదరాబాద్‌లో చికిత్స పొంది వచ్చినప్పటికీ అతనిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడంతో పరిసర  ప్రాంత ప్రజలు సోమవారం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

    అనంతపురంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యూరు. అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు స్వైన్‌ఫ్లూ సోకింది. 4 రోజులుగా విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. వ్యాధి నిర్థారణ నివేదిక ఆదివారంమే అందినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ మాత్రం గోప్యంగా ఉంచింది. విజయనగరంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ మహిళకు స్వైన్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణైంది. నెల రోజుల్లో చిత్తూరులో 3 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
     
    వ్యాధి అదుపులోనే ఉంది  ((బాక్స్))
    రాష్ట్రంలో ఇప్పటి వరకూ 74 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితుల రక్తనమూనాలు సేకరించగా, వారిలో 36 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యమం చెప్పారు. ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూతో ముగ్గురు మరణించినట్టు తెలిపారు. ఈ వ్యాధి అదుపులోనే ఉందని, దీని నివారణకు అన్ని చర్యలూ తీసుకున్నామని చెప్పారు.
     
    జాగ్రత్తగా ఉండటమే నివారణ
    స్వైన్‌ఫ్లూ వైరస్ ఒకరినుంచి మరొకరికి సోకకుండా ఉండాలంటే ప్రధానంగా మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుకోవడమే మార్గం. ఇంట్లో సభ్యులకు సోకినా బాధితుడికి దగ్గరగా ఉండకూడదు. వ్యాధి రాకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. స్వైన్ సోకకుండా ఉండాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు మినహా మరో మార్గం లేదు.
    డా.ప్రభుకుమార్ చల్లగాలి, ఇంటర్నల్ మెడిసిన్, కేర్ ఆస్పతి
     
    ఇవీ లక్షణాలు..
    ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1)ని ఏ, బీ, సీ కేటగిరీలుగా గుర్తించారు. ఈ వ్యాధి ఒక్కోదశలో ఒక్కోరకంగా వ్యాప్తి చెందుతుంది.
     
     ఏ కేటగిరీలో..
     తీవ్రస్థాయి జలుబు, తుమ్ములు విపరీతం
     
     ముక్కు వెంట నీళ్లు కారడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, స్వల్ప జ్వరం
     
     బీ కేటగిరీలో..
     కొద్ది కొద్దిగా జ్వరం పెరగడం
     
     ఒళ్లు నొప్పులు మరింత పెరిగి, దగ్గు ఎక్కువై ఆయాసం రావడం
     
     సీ కేటగిరీలో..
     జలుబు తీవ్రమవుతుంది. ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి
     
     ఛాతీలో స్వల్ప నొప్పి. వ్యాధినిరోధకత తగ్గడం
     
     వ్యాధి తీవ్రత బాగా పెరిగి.. ఊపిరితిత్తులకు సోకడం
     
     ఈ దశలో.. రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం
     
     వీరు జాగ్రత్తగా ఉండాలి
    ఈ వ్యాధి గర్భిణిలో రావడం ఎక్కువ. కడుపులో బిడ్డ ఉంటుంది కనుక ఆక్సిజన్ తీసుకోవడంలో భారం పెరిగి.. వ్యాధి సోకే అవకాశం
     
      చిన్నపిల్లలు, వృద్ధుల్లోనూ ఈ వ్యాధి విస్తరణ వేగం
     
     హెచ్‌ఐవీ రోగుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువ
     
     ఊపిరి తిత్తుల వ్యాధి ఉన్న వారికీ సోకే అవకాశం
     
      షుగర్ వ్యాధిగ్రస్థులకూ సోకుతుంది.
     
     నివారణ  మార్గాలు..
     తుమ్ములతో కూడిన జలుబు వ స్తే.. వారం పాటు ఇంటిపట్టునే ఉండాలి
     
     ఇంట్లో ఉన్నవారు కూడా బాధితుడి దూరంగా ఉండాలి
     
     బీ కేటగిరీ దశలోకి వచ్చిన బాధితులు వైద్యుడి సలహాతో మందును వాడాలి
     
     సీ కేటగిరీ తక్షణమే ఆస్పత్రిలో చేర్చాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement