విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటికపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు వెలుగు చూశాయి.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటికపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు వెలుగు చూశాయి. సోమవారం మధ్యాహ్నం పట్టాలపై భార్యా భర్తలతోపాటు వారి పదేళ్ల కుమార్తె మృతదేహాలు కొద్ది దూరంలో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.