సూట్‌కేసులో యువకుడి మృతదేహం
సంబేపల్లె : వైఎస్‌ఆర్ జిల్లా సంబేపల్లె మండలం రెడ్డివారిపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని యువకుడి(32) మృతదేహం లభ్యమైంది. కుంట తూముల వద్ద ఓ సూట్‌కేస్‌లోంచి దుర్వాసన వస్తుండటంతో గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయచోటి రూరల్ సీఐ ప్రభాకర్ ఘటనా స్థలికి చేరుకుని వృతదేహాన్ని పరిశీలించారు. హత్య చేసి, మృతదేహాన్ని సూట్ కేసులో ఉంచి కొద్ది రోజుల క్రితం ఇక్కడ పడేసి వెళ్లినట్లు తెలుస్తోందన్నారు.
మృతుడు ఈ ప్రాంత వాసి అయి ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎర్రగా ఉన్న ఈ యువకుడు బ్రౌన్ రంగు ప్యాంటు, ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. మొహం గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉబ్బిపోయి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.