ఏలూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో ఈ ఏడాది పాత పనులతోనే కాలక్షేపం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యూరు. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే జిల్లా నీటి యూజమాన్య సంస్థ (డ్వామా) రూ.450 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించగా, ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
అరుుతే, వీటిలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులేమీ లేవు. ఇదిలావుండగా, ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో 60 శాతం నిధులను వ్యవసాయ అనుబంధ పనుల కోసం ఖర్చు చేయాలని సర్కులర్ జారీ అయ్యింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు మాత్రం విడుదల కాలేదు. గత ప్రభుత్వ హయూంలో అటవీ, ఉద్యాన, వ్యవసాయ, ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ తదితరు శాఖల సమన్వయంతో గ్రామాల్లో 26రకాల పనులను చేసుకోవడానికి అవకాశం లభించింది. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని అటుఇటుగా మార్చి ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తున్నట్టుగా చెబుతోంది.
గతంలో మార్గదర్శకాలు ఉన్నా గ్రామా ల్లో పంటబోదెలు, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో పూడిక తొలగింపు, పుంత రోడ్లు, శ్మశానవాటికల్లో మెరక పనులు, పొలం గ ట్లపై మొక్కలు నాటడం, మెట్టప్రాంత మంచినీటి చెరువుల్లో పూడిక తొలగిం పు పనులు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిం చడం ద్వారా పనులు చేపట్టే అవకాశాలు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నారుు. తాజా సర్క్యులర్ ప్రకారం ఏదో రకంగా పనులు చేద్దామన్నా.. వర్షాల కారణంగా కూలీలతో చెరువులు, పొలం గట్ల అభివృద్ధి, ఇతరత్రా పనులు చేసే పరిస్థితి లేదు. ఈ కారణంగా పథకం అనుసంధానం వల్ల ప్రయోజనం ఉండదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యవసాయంతో ‘ఉపాధి’ వట్టిమాటే
Published Tue, Aug 5 2014 1:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement