ఒకరి వెంట ఒకరు..! | They got married marriage | Sakshi
Sakshi News home page

ఒకరి వెంట ఒకరు..!

Jan 31 2014 3:15 AM | Updated on Apr 4 2019 3:02 PM

వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కష్టసుఖాల్లో తోడుగానీడగా ఉన్నారు. దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలను పంచుకున్నారు.

ఆళ్లగడ్డ రూరల్, న్యూస్‌లైన్: వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కష్టసుఖాల్లో తోడుగానీడగా ఉన్నారు. దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలను పంచుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమనుకున్నారేమో.. మృత్యువులోనూ తమ బంధాన్ని వీడలేదు. భర్త అనారోగ్యంతో మృతి చెందిన గంట సమయానికే భార్య కూడా కన్ను మూసింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామానికి చెందిన రామశేషయ్యఆచారి (58) రేణుకమ్మలు(50)లది అనోన్య దాంపత్యం. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. బుధవారం రామశేషయ్యఆచారికి గుండెనొప్పిరావడంతో ఆళ్లగడ్డ ఆసుపత్రిలో చూపించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం చేయాలని సూచించడంతో తిరుపతికి తీసుకెళ్లారు.  భార్య రేణుకమ్మ, కుమారుడు కుమార్ ఆచారి, బంధువులు ప్రత్యేక వాహనంలో తిరుపతికి వెళ్తుండగా కడప సమీపంలో రేణుకమ్మ అస్వస్థకు గురైంది.
 
 కడపలోని బంధువుల ఇంటివద్దకు తీసుకువెళ్లి అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. అనంతరం తిరుపతికి వెళ్లారు. అయితే రామశేషయ్యఆచారి తిరుపతిలో ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ విషయం రేణుకమ్మకు చెప్పకుండా తిరుగు ప్రయాణమయ్యారు. తన భర్తకు ఏమైందని అడుగుతూ భర్త మృతి చెందిన గంటలోపే ఆమెకు కనుమూసింది. స్వగ్రామంలో పుణ్యదంపతులకు బంధువులు దహనసంస్కారాలు చేశారు. ఒకే రోజు భార్యాభర్త తనువుచాలించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement