అమలాపురం రూరల్: అమలాపురంలో సినీ ఫక్కీలో రూ.20 లక్షలు దోచేసి..దొరికిపోయిన తమిళనాడుకు చెందిన నలుగురు దొంగల ముఠాపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఖరీదైన కారులో వచ్చి మరీ చోరీకి పాల్పడిన ఆ దొంగల ముఠాలోని నలుగురూ కరడు కట్టిన నేరస్తులని దర్యాప్తులో తేలింది. వీరు చోరీలు చేసేటప్పుడు ఎవరైనా అడ్డు వస్తే హతమార్చేందుకు కూడా వెనకాడరని తెలిసింది. ఇటీవల తమిళనాడు, నెల్లూరుకు చెందిన కొందరు ఆక్వా వ్యా పారులు కోనసీమకు వచ్చిన విషయం, అమలాపురం కేంద్రంగా రూ.కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్న విషయాన్ని ఈ ముఠా ముందే పసిగట్టినట్టు సమాచారం.
వారం క్రితమే వీరు అమలాపురంలో రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఆక్వా వ్యాపారుల వివరాలు, వారు ఎక్కడెక్కడ బ్యాంకులు, ఏటీఎంలలో సొమ్ము డ్రా చేస్తున్నదీ ఆరా తీసినట్టు సమాచారం. వీరు బుధవారం ఉదయం నుంచి వివిధ బ్యాంకుల వద్ద నక్కి అదును కోసం చూసి మధ్యాహ్నానికి చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇది అం తరాష్ట్ర ముఠా అయి ఉండవచ్చన్న దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిమజ్జనాల వల్లే దొరికారు
ఈ ముఠా కారులో పరారవుతున్నప్పుడు అమలాపురం నుంచి మహిపాల చెరువు వరకూ జాతీయ రహదారిపై గణేశ్ విగ్రహాల నిమజ్జనాల ఊరేగింపులు వరసపెట్టి జరగుతున్నాయి. ముఠా అతివేగంగా వెళదామన్నా ఊరేగింపులతో అది సాధ్యపడలేదు. ముఠా పట్టుబడడానికి ఇది కూడా ఓ కారణం. తమను వెంబడిస్తున్న వారి దృష్టి మరల్చడానికే ముఠా సభ్యులు డబ్బు సంచులు విసిరినట్టు తెలుస్తోంది.
ముమ్మిడివరం మండలం అనాతవరంలో కొన్ని రూ. 500 నోట్లను రోడ్డుపైకి విసిరారు. ఆ మొత్తం రూ.26 వేలని పోలీసులు గుర్తించారు. అయితే రూ.25లక్షలు చోరీ అయినట్టు బాధితుడు చెప్పినా, దర్యాప్తులో అతను డ్రా చేసింది రూ.20లక్షలేనని తేలింది. విసిరిన రూ.26వేలు ఆ దొంగలదేనని తెలిసింది. ముఠా కారు కూడా దొంగిలించిందేమోనని పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎ స్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు జరు గుతోంది. విచారణలో నిందితులు తమ చిరునామా, పేర్లు చెప్పకుండా పోలీసులను తికమక పెడుతున్నట్టు సమాచారం.
ఆ నలుగురూ కరుడుకట్టిన నేరస్తులు
Published Fri, Sep 12 2014 12:12 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement
Advertisement