ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: రబీ సీజ్‌కు సంబంధించి రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం ఓటు రాజకీయాల కోసం పాకులాడుతోందని విమర్శించారు. రైతుల గురించి పట్టించుకోని ప్రభుత్వాలు కనుమరుగవడం ఖాయమని అన్నారు.
రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీని భవిష్యత్‌లో ప్రజలు ఓడిస్తారని అన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి జిల్లాలోని ప్రతీ గ్రామంలో రైతుల కోసం గ్రామ సభలు నిర్వహిస్తామని అన్నారు. రైతుల కోసం నెలకు రెండుసార్లు గ్రీవెన్స్‌డే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న సన్నకారు రైతులకు 50శాతం సబ్సిడీపై డీజిల్ అందజేయాలని కోరారు. విత్తనాల కోనుగోలు కోసం రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు.
దీని వల్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సులువుగా ఉంటుందని అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో దళారీల రాజ్యం నడుస్తోందని, దానిని అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంచందర్‌రావు, దొంగల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గెల్లా సత్యనారాయణ, నాయకులు కొర్లకుంట్ల గోవర్ధన్, చిలుకూరి రమేష్, నంద్యాల శ్రీను, కొండి ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
Published Sun, Jan 12 2014 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement