
తాటిపూడి జలాశయంలో ముగ్గురి గల్లంతు
గంట్యాడ (విజయనగరం జిల్లా) : గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతులు విశాఖపట్నం జిల్లా సింహాచలానికి చెందినవారుగా గుర్తించారు. మొత్తం ఏడుగురు కుటుంబసభ్యులు విహారయాత్రకు వెళ్లారు. స్నానానికి దిగిన సమయంలో ఈత రాకపోవడంతో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు మునిగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.