ఎడతెగని వానలతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గోస్తనీ నదిపై ఉన్న తాటిపూడి రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది.
గంట్యాడ (విజయనగరం) : ఎడతెగని వానలతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గోస్తనీ నదిపై ఉన్న తాటిపూడి రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 292 అడుగుల నీరు చేరింది. ఎగువ నుంచి 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
మరో మూడు అడుగుల నీరు చేరితే జలాశయం గేట్లు ఎత్తి వేస్తామని అధికారులు తెలిపారు. వరద రాకడ కొనసాగుతున్నందున ఏ క్షణానైనా గేట్లు ఎత్తుతామని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.