అక్కపెళ్లికి మా ముగ్గురిని పిలవలేదు
గుంటూరు: కృష్ణా నదిలో మునిగి ముగ్గురు విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి మృతి చెందారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ఆటోనగర్ కు చెందిన పల్లవి, పూజిత, నాగలక్ష్మి.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగర్ వద్ద కృష్ణా నదిలో మునిగి మృతి చెందారు.
నది ఒడ్డున ఉన్న బ్యాగులు, కాలేజీ ఐడీ కార్డుల ఆధారంగా వీరిని గుర్తించారు. విద్యార్థినుల్లో ఒకరి పుస్తకంలో 'అక్కపెళ్లికి మా ముగ్గురిని పిలవలేదు' అని రాసివుండడంతో వీరు ఆత్మహత్య చేసుకున్నారా అన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వీరిలో ముగ్గురు అబ్బాయిలు కూడా నది ఒడ్డున ఆడుకోవడం చేశామని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు మునిగిపోయారా లేక వీరితో వచ్చిన అబ్బాయిలు ఏదైనా దుశ్చర్యకు పాల్పడ్డారా అనేది పోలీసులు తేల్చనున్నారు. ఈ ముగ్గురు అబ్బాయిలు ఎవరనేది తెలిస్తే ఏం జరిగిందనేది తెలుస్తుంది.