నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
నల్గొండ : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నెంబరు జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను శ్రీనివాస్, కామేష్, పూర్ణచంద్రికగా గుర్తించారు. కారు ( AP 28 DS 2224), లారీ ఒకదానికొకటి ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది.
గాయపడినవారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా హైదరాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.