వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు అదుపు తప్పి ముగ్గురు విద్యార్థులను ఢీకొట్టిన సంఘటన విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం 47వ వార్డులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
విశాఖపట్నం: వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు అదుపు తప్పి ముగ్గురు విద్యార్థులను ఢీకొట్టిన సంఘటన విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం 47వ వార్డులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీలోని సరస్వతి విద్యావిహార్ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు అదే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులను ఢీకొంది.
పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న భార్గవ (12), రిషిత (13), ఉమేష్ (12) ఉదయం పాఠశాలకు వస్తున్న సమయంలో ఎదురుగా దూసుకొచ్చిన బస్సు వాళ్లను ఢీకొంది. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాల సిబ్బంది గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యెక్షసాక్షులు చెప్తున్నారు.