
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు 5 కంపార్లుమెంట్లలో వేచి ఉండగా, దర్శనానికి 6 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, 4 కంపార్లుమెంట్లలో వేచి ఉన్న నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్లుమెంట్లు నిండాయి.
అయితే ఈ నెల 26న జరగనున్న రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. రథ సప్తమి సందర్భంగా తిరుమలలో అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రోటోకాల్ పరిధిలో ఉన్నవారికి మాత్రమే వీఐపీ దర్శనాలు ఉంటాయని టీటీడీ పేర్కొంది.
గదుల వివరాలు:
ఉచిత గదులు-39 రూ.50 గదులు- 133 రూ.100 గదులు - 9 రూ.500 గదులు - 16 ఖాళీగా ఉన్నారుు
ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 115 సహస్ర దీపాలంకరణసేవ - 142 వసంతోత్సవం - 45 ఖాళీగా ఉన్నాయి
గురువారం ప్రత్యేక సేవ: తిరుప్పావడ