
నేడు సీఎం రాక
విజయవాడ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు జిల్లాకు రానున్నారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 9.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు గుంటూరు పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని అక్కడ ఉపాధ్యాయ దినోత్సవాల్లో పాల్గొంటారు. 1.15 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 2.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ వెళతారు. కాగా ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని విమానాశ్రయంలో ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. తనిఖీలను ముమ్మరం చేశారు.