ఇందూరు, న్యూస్‌లైన్: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలోగతంలో పోటీ చేసినవారితో పాటు కొత్తగా రేసులోకి దిగేవారు కూడా తమకు రిజర్వేషన్‌లు కలిసి వస్తాయో లేదోననే ఉత్కంఠలో ఉన్నారు. గెజిట్ నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానున్నం దున జిల్లాలో అధికార, ఇతర పార్టీల నా యకులు గెలుపు గుర్రాల కోసం వెతుకులా ట ప్రారంభించారు. మరికొందరు ఆశావహులు కీలకమైన జ డ్పీ చైర్మన్ గిరి కోసం పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్‌లు ఖరారు కాక ముందే తాము పోటీ చేస్తున్నామంటూ ఇప్పటి నుం చే పలువురు ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం రోజు రో జుకు వేడెక్కుతోంది.
2006 ఎన్నికల్లో జిల్లాలో 528 ఎం పీటీసీ, 36 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 2011 జూలైలో పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు జరుగనున్న ఎన్నికలకు 2011 జనాభా లెక్కల ప్రకారం 55 ఎంపీటీసీ స్థానాలు అదనంగా పెరిగాయి. నియోజక వర్గాల పున ర్విభజనలో ఎల్లారెడ్డి, సదాశివనగర్, వేల్పూర్, నందిపేట్ మండలాలు మినహా అన్ని మండలాల్లో ఒకటి నుంచి ఐదు వరకు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి.
పెరిగిన స్థానాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు 2013 సెప్టెంబర్ 14న ముసాయిదా జాబితాను విడుదల చేసి మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మొత్తం 20 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో 11 అభ్యంతరాలు పరిష్కరించి, 9 అభ్యంతరాలను అధికారులు తిరస్కరించారు. 27న మళ్లీ ఎంపీటీసీల తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలో పెరిగిన 55 స్థానాలతో మొత్తం ఎంపీటీసీల సంఖ్య 583కు చేరింది. ఎంపీటీసీ స్థానాలు పెరడగడం పై వివిధ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
అధికారుల కసరత్తు
రెండు రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్‌లను ఎన్నికల కమిషన్ ప్రకటించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తును ప్రారంభించారు. ఈ పాటికే జిల్లాలో 1695 పోలింగ్ కేంద్రాలు, వాటిలో ఏర్పాటు చేసే పోలింగ్ బాక్సులను సిద్ధం చేసి ఉంచారు. ఓటర్ల జాబితా కూడా సిద్ధంగా ఉంది. ఇటు నగర పాలక ఎన్నికలకు సమాయత్తం అవుతూనే స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. కాగా ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులు, లేదా ఈవీఎంల ద్వారా నిర్వహించే విషయమై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
స్థానికానికీ సై
Published Wed, Mar 5 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement
Advertisement