తోటప ల్లి ప్రాజెక్టు కోసం కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాలకు చెందిన 20 గ్రామాల్లోని 528 కు టుంబాల వారు తమ భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులు వదులుకున్నా రు.
విజయనగరం కంటోన్మెంట్: తోటప ల్లి ప్రాజెక్టు కోసం కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాలకు చెందిన 20 గ్రామాల్లోని 528 కు టుంబాల వారు తమ భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులు వదులుకున్నా రు. వారంతా ఇప్పుడు తీవ్ర ఇబ్బం దుల్లో జీవనం సాగిస్తున్నారు. వారికి అందజేస్తామన్న ప్యాకేజీలు, ఇళ్ల స్థలాలు, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. పెద్ద గోతులున్న చోట స్థలాలు కేటాయించడంతో ఏం చేయాలో అర్థంకాక వారు ఆందోళన చెందుతున్నారు.
నిర్వాసితుల సమస్యలు
చాలా మంది నిర్వాసితులకు ఇంకా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. భూసేకరణ జరగలేదు నిర్వాసితులు కోరిన చోట కాకుండా.... అధికారులు త మకు నచ్చిన చోట స్థలాలు కేటాయించడంతో ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోతుల్లో స్థలాలిచ్చి, వాటిని చదును చేయకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం గోతులు కప్పేందుకే సరిపోతోంది, ఇసుకకూడా లభించకపోవడంతో ఇళ్లులు కట్టుకోలేకపోతున్నారు. జలాశయంలో నీరు నిల్వ ఉంచితే కొమరాడ మండలం గుణానుపురం, జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తుంది. దీంతో వారు భయాందోళన చెందుతున్నారు.
జియ్యమ్మవలస మండలం బాసంగి, గదబవలస గ్రామాల నిర్వాసితులు తమ సమస్యలపై తహశీల్దార్ నుంచి ముఖ్యమంత్రి వరకూ పలు అర్జీలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేసేందుకు వస్తున్నప్పటికీ వారి సమస్యలు తీరడం లేదు. నిమ్మలపాడు, బిత్తరపాడు, భట్ల భద్ర, బాసంగి, గదబవలస తదితర గ్రామాలకు సీమనాయుడు వలసలో స్థలాలు చూపించారు. అయితే బాసంగి, గదబవలస గ్రామాలకు సంబంధించిన వారికి ఇంకా న్యాయం చేయలేదు. బాసంగిలో 384 మందికి ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికీ అమలు కావడం లేదు. ఇందులో 215 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మిగిలిన 169 మందికి ఇవ్వాల్సి ఉంది. తమ పొలాలున్న చోట తమకు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలివ్వాలని వారు కోరుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు.
టీడీపీ నాయకుల భూములున్నాయని...
సీమనాయుడు వలస వద్ద బాసంగి నిర్వాసితులకోసం గెడ అవతల శ్మశాన వాటికను కేటాయించడంతో నిర్వాసితులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుక్రితం గ్రామానికి చెందిన శీర రామచంద్ర అనేవ్యక్తి, మరో వ్యక్తి మృతి చెందగా గెడ్డ ఇవతల చితి పేర్చారు. అయితే గ్రామస్తులు అంగీకరించకపోవడంతో దానిని తొలగించి మరో చోట పోలీసుల సమక్షంలో దహనం చేయించారంటే నిర్వాసితులకు ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. గెడ్డ ఇవతల టీడీపీ నాయకులకు చెందిన భూములుండడం వల్లే అక్కడ శ్మశానానికి స్థలం కేటాయించలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. గెడ్డ అవతల శ్మశానానికి కేటాయించిన మూడెకరాల స్థలం కూడా పెద్ద గోతులు, గుమ్ములతో నిండి ఉందని వాపోతున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నిర్వాసితులను జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు.
సీఎం వస్తున్నారని హడావుడిగా
ఎలాగైనా తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించేయాలనే తాపత్రయమే తప్పా... నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఎక్కడా కనిపించడంలేదు. నిర్వాసితులకు ఇచ్చేందుకు వీలుగా సీమనాయుడు వలస, వెంకటరాజ పురం గ్రామాల నుంచి ఎలాంటి నోటీసులు లేకుండా 30 ఎకరాలను సేకరించారు. అలాగే సుంకి, నందివాని వలస గ్రామాలకు తులసిరామునాయుడు వలస వద్ద తీసుకున్న 62 ఎకరాల్లో కొంత చదును చేసి కొంత చదును చేయలేదు. సుంకిలో 324 పట్టాలకు కేవలం 160 పట్టాలిచ్చారు. ఇంకా ఇక్కడ మిగతా వారికి ఇవ్వాల్సి ఉంది. నందివాని వలసకు సంబంధించి 26 ఎకరాలు తీసుకుంటున్నప్పటికీ దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషనే ఇంకా ఇవ్వలేదు. నిర్వాసితుల కోసం భూములిచ్చిన మాకు ఇంకా పరి హారం ఇవ్వలేదని గ్రీవెన్స్‌సెల్‌కు భూముల యజమానులు వచ్చి ఫిర్యాదులు చేస్తునే ఉన్నారు.