ఆత్మకూరురూరల్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నల్లమలలో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆత్మకూరు అటవీ పరిధిలోని రుద్రకోడు క్షేత్రం, స్మృతివనం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి అయిన నల్లమలలో ఎకో ఫ్రెండ్లీ టూరిజంను ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ ముందుకు వచ్చిందన్నారు.
అందులో భాగంగానే రెండు రోజుల పాటు స్థలాలను పరిశీలించామన్నారు. అయితే ఇవన్నీ పర్యాటక శాఖ అనుమతులతోనే నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటి ఏర్పాటు కోసం జిల్లాకు ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా కోటి రూపాయలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో ఆత్మకూరు ప్రాంతంలోని స్మృతివనం, రుద్రకోడు క్షేత్రం, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం, శ్రీశైలం ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
పర్యాటక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పర్యాటక ప్రదేశాల వివరాలు తెలిపేందుకు గైడ్‌లను నియమిస్తామన్నారు. స్మృతివనం పరిసర ప్రాంతాల్లోని సర్వే నెంబర్ 563లోని ఆరు ఎకరాల స్థలంలో పది గృహాలు, ఒక డార్మెటరీ నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం కర్నూలు నుంచి రోళ్లపాడు మీదుగా రుద్రకోడు, స్మృతివనం ప్రాంతాలను చూపిస్తామన్నారు.
విద్యార్థులను బాగా చదివించండి: ఐటీడీఏ పీఓ
చెంచులు తమ పిల్లలను బాగా చదివించాలని ఐటీడీఏ పీఓ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. రుద్రకోడు గూ డెంలో పర్యటించిన ఆయన చెంచులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరి శీలించి స్వయం సహాయక సంఘాల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీఓ మురళీధర్, ఐటీడీఏ స్పెషలాఫీసర్ కేజీ.నాయక్ పాల్గొన్నారు.
నల్లమలలో పర్యాటక కేంద్రాలు
Published Sat, Jan 25 2014 12:55 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM
Advertisement
Advertisement