అరకులోయ: కొండ చరియలు విరిగిపడటంతో.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విశాఖ జిల్లా అరకులోయలోని 65వ టన్నల్ వద్ద కొండ చరియలు విరిగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విశాఖ నుంచి కిరండోల్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు రెండు గంటలపాటు నిలిచిపోయింది. బొర్ర-చిమిడిపల్లి మధ్యలో రైలు ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజన్ ఏర్పాటు చేసి రైలును తరలించారు.