సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. తొలుత అమరావతి పరిసర ప్రాంతాల్లోని రూ. 1,300 కోట్ల విలువైన ఏపీ ట్రాన్స్కో పనులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధంచేసింది. ఆ తర్వాత దశల వారీగా అన్ని విద్యుత్ సంస్థల నిర్వహణను ప్రైవేటు కంపెనీల చేతిలో పెట్టాలని నిర్ణరుుంచుకుంది. దీనిపై శనివారం గుట్టు చప్పుడు కాకుండా ‘బూమ్’(బిల్డ్ ఆపరేట్ ఓన్ మెరుుంటెన్‌స) నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్కోకు సంబంధం లేకుం డా ట్రాన్‌సమిషన్ లైన్లు, సబ్ స్టేషన్లను ప్రైవేట్‌కు అప్పగించాలని భావించింది. ఈ విషయంలో మంగళవారం బడా కంపెనీలతో విద్యుత్ ఉన్నతాధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పెద్దలకు ఈ బడా కంపెనీలు భారీ మొత్తంలో ముట్టజెప్పేందుకు ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
సీఎంతో ప్రైవేట్ సంస్థల ప్రతినిధుల భేటీ
నూతన రాజధాని నలువైపుల నుంచి విద్యుత్ సరఫరా ఉండేలా ప్రభుత్వం పథకాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఏపీ ట్రాన్స్కోనే చేపడుతుందని సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. అరుుతే వారం రోజుల క్రితం కొన్ని ప్రైవేటు సంస్థల ప్రతినిధులు సీఎంను కలవడంతో ప్లాన్ మారిపోరుుంది. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ, నిర్వాహణ బాధ్యత ప్రైవేటు వ్యక్తులకే అప్పగించాలని నిర్ణరుుంచారు. ఇందుకు అనుగుణంగా బిల్డ్ ఆపరేట్ ఓన్ మెరుుంటెనెన్‌స పేరుతో ప్రకటన జారీ చేసింది. తెలుగు పత్రికలకు ఈ ప్రకటన ఇవ్వకుండా.. ఒకటి రెండు ఇంగ్లిష్ పత్రికల్లో కనబడీకనబడనట్లు ప్రచురించారు. ప్రైవేటు వ్యక్తులు నిర్మించే ఈ ప్రాజెక్టులన్నీ 35 ఏళ్ల పాటు వారి అజమారుుషీలోనే ఉంటారుు. వారు ఎంతైనా దండుకునేందుకు ప్రభుత్వం వెసులు బాటు కల్పిస్తోంది. రాజధాని లైన్ల నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌కు ప్రైవేటు వ్యక్తులే చార్జీలు నిర్ణరుుస్తారు.
ప్రైవేట్ చేతుల్లోకి ట్రాన్స్కో !
Published Wed, Nov 23 2016 2:04 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement