చివరిఆశలు | Transplanting on the Canary | Sakshi
Sakshi News home page

చివరిఆశలు

Published Sun, Aug 3 2014 12:34 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

చివరిఆశలు - Sakshi

చివరిఆశలు

  •       అదను దాటుతోంది
  •      ముసురు వానతో పొలాలకు అందని జీవతడి
  •      మరో రెండువారాలే కీలకం
  •      మైదానంలో కానరాని వరినాట్లు
  •      నారుమళ్లపై పురుగుల దాడి
  • అనకాపల్లి : జిల్లాలో వరి సాగు ఆందోళనకర పరిస్థితుల్లో కొనసాగుతోంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్న పొలాలకు జీవతడిని అందించే స్థాయిలో లేకుండా పోయాయి. జూలై మాసంలో కురిసిన వర్షాలు వరి నారుమళ్లు వేసుకోవడానికి దోహదపడినప్పటికీ ఆగస్టు మొదటి రెండు వారాల్లో కురిసే వర్షపాతమే కీలకం కానుంది. జూలైలో 197.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 166.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

    దీంతో 15.61 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2లక్షల 8వేల 783 హ క్టార్లలో 23 రకాల పంటలు సాగు అవ్వాల్సి ఉండగా, ఇంకా నాట్లు ప్రక్రియ లేని పంటలు చాలా ఉన్నాయి. అధికంగా సాగు చేసే వరి సాగు విస్తీర్ణం 96,519 హెక్టార్లు అయితే 8,638 హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. అది కూడా ఏజెన్సీలోనే అధికం. మైదానంలో కేవలం వరి నారుమళ్ల స్థాయిలోనే ఉంది.

    జూన్, జూలైల్లో వర్షపాతం ఆశిం చిన మేరకు నమోదు కాకపోవడంతో జిల్లాలో వరి రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు స్వల్ప కాలిక రకాలను వరి నారుమళ్లకు వినియోగించారు. సరిహద్దు జిల్లాల్లో సైతం నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటే జిల్లాలో మాత్రం నదులు, సాగునీటి కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. మరో రెండువారాల్లో వర్షపాతం వరి రైతుల భవితవ్యాన్ని నిర్దేశించనుంది. ఇప్పటికే వరి నారుమళ్లు చాలాచోట్ల రంగుమారినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
     
    అదను దాటితే...
     
    ఆగస్టు 15 దాటితే అదును దాటిందని గుర్తించి నేరుగా వెదజల్లే పద్ధతిలో స్వల్పకాలిక రకాలైన కాటన్‌దొర సన్నాలు, నెల్లూరు సన్నాలను ఆశ్రయించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ప్రదీప్, కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవ్తేత శ్రీహరి చెబుతున్నారు. కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తలు అనకాపల్లి మండలంలోని మార్టూరుతో పాటు రాంబిల్లి, యలమంచిలి, పరవాడ మండలాలలో పొడి దుక్కులో వరివిత్తే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

    గత రెండేళ్లలోను ఇదే తరహాలో ఆగస్టు వరకు వర్షపాత లోటు నమోదు కావడంతో నాట్లు వేసేటప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేసినప్పటికీ పంట కోత దశలో ముంచెత్తిన వర్షాలు దిగుబడిని ప్రభావితం చేశాయి. గత ఏడాది ఎకరాకు  16 నుంచి 17 బస్తాలు (75 కేజీల బస్తా) దిగుబడినిచ్చాయి. వాస్తవానికి జిల్లాలో 25 బస్తాల వరకు దిగుబడి రావాల్సి ఉంది. ఈ ఏడాది కూడా అదే తరహా పరిస్థితి పునరావృతమయితే అప్పులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement