వేలేరుపాడు : మండలంలోని చాగరపల్లి గ్రామానికి చెందిన మిరియాల బాబూరావు (35) శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గిరిజనుడు బాబూరావు కొడుకు ఏడాదిగా వింతవ్యాధితో బాధపడుతున్నాడు. అప్పులు చేసి అతనికి హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ కూడా చేయిం చాడు. అయితే జబ్బు నయం కాకపోవడంతో వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అంతగా ఆర్థిక స్తోమత లేని బాబూరావు తీవ్రంగా మనస్థాపం చెంది శనివారం ఉదయం ఇంట్లో పురుగుమందు తాగాడు. అతనిని కుటుంబ సభ్యులు వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలిం చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో బాబూరావు మృతి చెందాడు. వేలేరుపాడు ఎస్ఐ రామచందర్రావు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
పురుగుమందు తాగి గిరిజనుడి ఆత్మహత్య
Published Sun, May 15 2016 3:29 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement
Advertisement