కన్నీటి స్వాగతం | TRS MLA and MPs visited in flood areas | Sakshi
Sakshi News home page

కన్నీటి స్వాగతం

Published Mon, Oct 28 2013 2:15 AM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పంట నష్టపోయి గుండె చెదిరిన రైతులను ఓదార్చేందుకు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే లు, నాయకులు ఆదివారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశా రు.

సాక్షి ప్రతినిది, ఆదిలాబాద్ :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పంట నష్టపోయి గుండె చెదిరిన రైతులను ఓదార్చేందుకు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే లు, నాయకులు ఆదివారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశా రు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, నాయకులు రెండు బృందాలుగా తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పర్యటించారు. ఎంపీ డాక్టర్ జి.వివేక్, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, రామగుండం ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, సోమారపు సత్యనారాయణ, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు తదితరులు తూర్పు ప్రాంతంలో తిరిగారు.
 
 ఆదిలాబాద్, ముథోల్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, సముద్రాల వేణుగోపాలాచారి, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం 10 గంటలకు మొదలైన ప్రజాప్రతినిధుల పర్యటన రాత్రి 9.30 గంటలకు ముగిసింది. వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతోపాటు, గుండె చెదిరి ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను వారు పరామర్శించారు. నిర్మల్, సిర్పూరు, చెన్నూరు, బోథ్, ముథోల్, ఆదిలాబాద్ తదితర నియోజకవర్గాల్లో రెండు జట్లుగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల బృందాలు గుండె చెదిరిన రైతు కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేశాయి.
 ప్రజాప్రతినిధులతో అన్నదాతల వేదన
 ప్రజాప్రతినిధులతో అన్నదాతలు వారి గోడు వెల్లబోసుకున్నారు. ముథోల్ నుంచి ఆదిలాబాద్ వరకు... కౌటాల నుంచి చెన్నూరు వరకు ఎవరినీ కదిలించినా కన్నీళ్లే కనిపించాయి. ఆరుగాలం అనేక కష్టన ష్టాల కోర్చిన రైతన్నకు తుపాన్, వరదలు నష్టాలను మిగిల్చగా పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిదుల బృందాలకు అన్నదాతల వేదనలే ఎదురయ్యాయి. నిర్మల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణుగోపాలాచారి, జోగు రామన్నలు పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. దిలావర్‌పూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు శేఖ్ మౌలానా కుటుంబాన్ని, దిలావర్‌పూర్‌లోని కోడె పెద్దొళ్ల ముత్యం కుటుంబాన్ని, సారంగాపూర్ మండలం కౌట్ల(బి)లో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు తండ్రి, కుమారుడు బర్ల భీమన్న, బర్ల శంకర్ కుటుంబాలను పరామర్శించారు.
 
 ఒక్కో కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ముథోల్, భైంసా మండలం వానల్‌పాడ్, తిమ్మాపూర్ గ్రామశివారుల్లోని రైతులతో ఎమ్మెల్యేలు మాట్లాడారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆదిలాబాద్ మండలంలోని అంకోలి గ్రామంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు పోశమల్లు, దాండ్ల రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం జిల్లాలో నమోదైందని, దీంతోపాటు అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందజేయడంలో జాప్యం చేయకుండా పెట్టుబడి పెట్టిన దానికైన రూ.18వేల నుంచి రూ. 20వేల వరకు ఎకరానికి నష్టపరిహారం అందజేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
 
 
 రైతుబిడ్డగా స్పందిస్తానన్న కలెక్టర్ బాబు  
 చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో జిల్లాలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని ఈ మేరకు జిల్లా రైతుల ను ఆదుకునేందుకు ప్రభుత్వానికి తక్షణమే నివేదిక పంపాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం కలెక్టర్ అహ్మద్ బాబుని కలిసింది. తడిసిన ధా న్యం, సోయాబీన్ పంటలను మార్క్‌ఫెడ్ ద్వా రా కొనుగోలు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్ద తు ధరను అందజేయాలని, 421 జీవోను అమ లు చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. జిల్లాలో వరద ప్రాంతాలను సందర్శిం చి దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలు, బాధితుల ను కలుసుకున్న అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ల బృందం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అహ్మద్‌బాబును కలిసి వినతి పత్రాన్ని అం దజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, తాను కూడా రైతు బిడ్డనేనని పేర్కొన్నారు.
 
 అంతకు ముందు జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలుగా పర్యటించిన టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రాంతంపై చూపెడుతున్న వివక్షతోనే ఇక్కడి రైతాంగానికి పరిహా రం అందడలేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిహారం అందజేసేందుకే తాము పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇటీవల కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన బాధితులను పరామర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, నిర్మల్, ముథోల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లోని పంటలను పరిశీలించడం జరిగిందన్నారు.
 
 ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుం బాలకు 2004లో 241 జీవో విడుదల చేసి వైఎస్సార్ పీఎం నిధి ద్వారా రూ.50 వేలు, సీఎం సహాయ నిధిద్వారా రూ.లక్ష ఇచ్చారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని వారు పేర్కొన్నారు. గతంలో సీఎం కిరణ్ అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం చేపట్టిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ప్రస్తుతం రైతులు నష్టపోతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని కూడ వారు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement